end
=
Wednesday, January 22, 2025
సినీమాశ్రీనువైట్ల- విష్ణు కాంబోలో మరో మూవీ..
- Advertisment -

శ్రీనువైట్ల- విష్ణు కాంబోలో మరో మూవీ..

- Advertisment -
- Advertisment -

టాప్ డైరెక్టర్ శ్రీనువైట్ల, యంగ్‌ హీరో మంచు విష్ణు కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతోంది. వీరి కాంబోలో ఇదివరకు వచ్చిన ‘ఢీ’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్ డూపర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీలో విష్ణు, జయప్రకాష్‌ రెడ్డి, సునీల్‌, శ్రీహరి, బ్రహ్రానందం పండించిన కామెడీ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. విష్ణుకు జోడీగా జెనీలియా నటించారు. ఈ సినిమాలోని పాటలు కూడా సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నాయి.

కాగా, ఇటీవల పుట్టిన రోజు జరుపుకున్న మంచు విష్ణు.. శ్రీనువైట్లతో మూవీని అనౌన్స్‌ చేశాడు. డీడీ(డబుల్‌ డోస్‌) టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. సూపర్‌ హిట్ కాంబినేషన్‌ రిపీట్‌ కానుండడంతో ప్రేక్షకులు సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, పెద్దన్నయ్య శ్రీనువైట్లతో మరో మూవీ చేయడం ఆనందంగా ఉందని విష్ణు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశాడు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్ పై విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -