end
=
Monday, January 20, 2025
సినీమాఅనిల్‌ నుంచి మరో మల్టీస్టారర్‌
- Advertisment -

అనిల్‌ నుంచి మరో మల్టీస్టారర్‌

- Advertisment -
- Advertisment -

‘సరిలేరునీకెవ్వరు’ సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకున్న యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి.. మల్టీస్టారర్‌ సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే అనిల్‌ ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌, వెంకటేశ్‌ కాంబినేషన్‌లో ‘ఎఫ్‌3’ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్‌2’ బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సొంత చేసుకుంది. తాజాగా ఈ స్టార్‌ డైరెక్టర్‌.. మరో మల్టీస్టారర్‌ చేయనున్నట్లు టాలీవుడ్ టాక్‌. అగ్ర కథానాయకుడు నాగార్జున, ఆయన తనయుడు అఖిల్‌తో ఈ మూవీ చేస్తున్నారు అనిల్. ఆ సినిమా స్క్రిప్టును తయారు చేసే పనిలోనే అతను బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అనిల్‌ రావిపూడి చేసిన ఏ మూవీ నిరాశపరచలేదు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -