తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో రథం దగ్గమైంది. ఈ ఘటన శనివారం మధ్య రాత్రి జరిగినట్లు సమాచారం. షెడ్డులో ఉన్న రథానికి మంటలు అంటుకొని పూర్తిగా దగ్దమైంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఎవరికి తెలియడం లేదు. ఎవరైనా కావాలనే కాల్చేశారా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 40 అడుగులు ఉన్న స్వామివారి రథాన్ని 60 సంవత్సరాల క్రితం పూర్తి టేకు కలపతో తయారు చేశారు. ప్రతీ సంవత్సరం స్వామివారి కల్యాణోత్సవానికి ఈ రథాన్ని ఉపయోగిస్తారు.
భారత పౌరులను అపహరించిన చైనా బలగాలు
అయితే ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ దేవదాయశాఖ మంత్రి శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. తక్షణమే విచారణ చేపట్టాలని దేవదాయశాఖ అదనపు కమిషనర్ రమచంద్రమోహన్‌ను ఆదేశించారు. పోలీసులతో కలిసి దేవదాయశాఖ అధికారులు పూర్తి విచారణ చేపడుతారని మంత్రి పేర్కొన్నారు. కాగా రథాన్ని మళ్లీ తయారు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.