end

బెట్టింగ్‌పై అనురాగ్‌ ఠాకూర్‌ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారత్‌లో బెట్టింగ్‌ను ఓ నేరంగా పరిగణిస్తారు. ఎవరైనా బెట్టింగ్ పాల్పడినట్లు తెలిస్తే.. పోలీసులు తమ లాఠీలకు పని చెబుతారు. కానీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ అనురాగ్‌ ఠాకూర్‌ మాత్రంబెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని చెబుతున్నాడు. తద్వారా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వంటి అనుచిత విధానాలను అరికట్టవచ్చవని మంత్రి అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రభుత్వానికి పన్నుపరమైన ఆదాయాలు సమకూరుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలంటూ ప్రధాని ఆర్థిక సలహా మండలి(ఈఏసీపీఎం) పార్ట్‌టైమ్‌ సభ్యుడు నీలేష్‌ షా చేసిన వ్యాఖ్యలపై ఠాకూర్‌ ఇలా స్పందించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి దేశాలు దీన్ని చట్టబద్ధం చేసిన సంగతిని గుర్తు చేశారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, దీన్ని క్రీడలు లేదా ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించవచ్చని మంత్రి సూచించారు. బెట్టింగ్‌ అన్నది వ్యవస్థాత్మకమైనదని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడే వారిని గుర్తించేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మరి మంత్రి వ్యాఖ్యలపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.

Exit mobile version