విద్యార్థులపై ఫీజులు కట్టాలని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద త్వరలోనే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఆ డబ్బులను ఎవరైనా సరే ఫీజుల కొరకు మాత్రమే వాడాలనీ.. దుర్వినియోగం చేస్తే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ప్రతి కాలేజీలోనూ విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలనీ.. లేని పక్షంలో సదరు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని గవర్నమెంట్ హెచ్చరికలు జారీ చేసింది. కళాశాలల్లో మౌళిక సదుపాయాలు లేకపోతే 1902 నెంబర్‌కు కాల్ చేసి, ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.