end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంపాలిసెట్‌ అర్హత మార్కులు 25 శాతానికి తగ్గింపు
- Advertisment -

పాలిసెట్‌ అర్హత మార్కులు 25 శాతానికి తగ్గింపు

- Advertisment -
- Advertisment -
  • విద్యార్థులకు సిలబస్‌ భారం తగ్గించేందుకు నిర్ణయం
  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు క్వాలిఫైయింగ్‌ మార్కులతో సబంధం లేకుండా ప్రవేశాలు
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

అక్రమంగా ఇసుక రవాణా – ట్రాక్టర్లు సీజ్‌

పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌కు(పాలీసెట్‌ 2020) సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. పాలిసెట్‌లో అర్హతగా పరగణించే 30 శాతం మార్కులను 25 శాతానికి తగ్గిస్తూ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ స్పెషల్‌ సీఎస్‌ జి.అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆలస్యం అవడం వల్ల అలాగే విద్యార్థులు సిలబస్‌ను ఎక్కువ ప్రిపేర్‌ అవలేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

మరో 39 రైలు సర్వీసులు ప్రారంభం…

అలాగే ఎంసెట్‌, ఈసెట్‌లలో కూడా 25 శాతమే క్వాలిఫైయింగ్‌ మార్కులు ఉన్నాయని, అందుకే పాలిసెట్‌లో కూడా ఈ సదుపాయాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇదేగాకుండా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అర్హత మార్కులు సాధించకుండానే ప్రవేశం పొందవచ్చునని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 6 పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈ సంవత్సరం నుండి ఒకేషనల్‌ డిప్లొమా కోర్సులను కూడా ప్రారంభించనున్నట్లు అనుమతులు మంజూరయ్యాయి.

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్య

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -