ఆపన్నహస్త మిత్ర బృందం వారి 40వ సహాయ సహాయ కార్యక్రమం అనాజిపూర్ గ్రామంలో జరిగింది. వివరాలు చూస్తే.. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం అనాజిపూర్ గ్రామంలో కర్రోని శ్రీను(35) ఇటీవల మరణించారు. మృతుని భార్య లక్ష్మి(29) కూడా అనారోగ్యంతో గత సంవత్సరం మరణించారు. దీంతో వారి ముగ్గురు పిల్లలు అరుణ్(10), కిషోర్, హారిక(3) అనాథలుగా మారారు. పిల్లలకు వారి నాన్నమ్మే దిక్కుగా మారింది. గ్రామస్తులు బంధువులు చేసిన ఆర్థిక సహాయంతో శ్రీను అంత్యక్రియలు నిర్వహించారు.
బీజేపీ అసత్య ప్రచారం చేస్తోంది: మంత్రి హరీష్
పిల్లల బాగోగులు, చదువుల నిమిత్తం ఆపన్నహస్త మిత్ర బృందం పిల్లలకు Rs.20000/-వేల రూపాయలు పోస్ట్ ఆఫీస్ లో ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు. దాంతో పాటు వారికి దీపావళికి బట్టలు, 50 కేజీల బియ్యం, నెలకు సరిపడా కిరాణం సరుకులు ఇప్పించి వారిని పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో.. ఆపన్న హస్త మిత్రబృందం అధ్యక్షులు పాశి కంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కుమ్మరి స్వామి, సభ్యులు డాక్టర్ గణేష్, శ్రీకాంత్, గ్రామ సర్పంచ్ శోభ, ఎంపీటీసీ జంగం నాగలింగం, గ్రామ పెద్దలు మల్లారెడ్డి, గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఉన్నారు.
శాఖాహారంతో పూర్తి ఫిట్‌నెస్..