end

సిటీ బస్సులు నడపనున్న APSRTC

  • సిటీ బస్సుల్లో 60 శాతం మాత్రమే ప్రయాణీకుల అనుమతి
  • ప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్‌ 19 నిబంధనలు పాటించాలి
  • సిటీ బస్సుల్లో నిలబడి ప్రయాణించడం నిషేధం

దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతోంది. గత ఆరు నెలలుగా ప్రజా రవాణా వ్యవస్థ మూలన పడింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ ప్రయోగాత్మకంగా శనివారం విజయవాడలో సిటీ బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్‌ఎం నాగేంద్ర ప్రసాద్‌ తెలిపారు. కరోనా వైరస్‌ వల్ల ఆర్టీసి బస్సులు నడపడం లేదు. చిరు వ్యాపారులు, సాదారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఎపీఎస్‌ఆర్టీసి సిటీ బస్సులను నడపాలని యోచిస్తోంది.

లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

విజయవాడలో శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు మొత్తం 6 రూట్లలో సిటీ బస్సులను తిప్పనున్నట్లు ఆర్‌.ఎం తెలిపారు. ప్రస్తుతం మైలవరం, విస్సన్నపేట, పామర్రు, ఆగిరిపల్లి, మంగళగిరి, విద్యాధరపురం ప్రాంతాలకు 100 బస్సులను నడపనున్నట్లు తెలిపారు. అయితే ప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్‌ 19 నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు

ప్రస్తుతం 60 శాతం ప్రయాణీకులను మాత్రమే అనుమతిస్తున్నారు. బస్సులో ఒక్కో సీటుకు కేవలం ఒక ప్రయాణీకుడు మాత్రమే కూర్చోవాల్సి ఉంటుంది. నిలబడి ప్రయాణించడానికి అనుమతి లేదు. ప్రతి స్టేజ్‌ వద్ద ఆర్టీసి ఉద్యోగి ఉండి ప్రయాణీకులకు శానిటైజ్‌ చేస్తారు. బస్సులో ఎటువంటి రాయితీలు, బస్‌పాసులు ప్రస్తుతం అనుమతించడం లేదని వివరించారు.

సెప్టెంబర్‌ 30న గురుకుల ప్రవేశ పరీక్షలు

Exit mobile version