end

అవి ప్రభుత్వ కట్టడాలా..? లేక వారి ఆస్తులా..?

  • టీఆర్‌ఎస్‌, ఎస్‌ఈసీపై ఉత్తమ్‌ ధ్వజం

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘంపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈసీ ప్రభుత్వ పార్టీకి వత్తాసు పలుకుతుందని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం అన్ని పార్టీల పట్ల సమ దృష్టితో చూడాలన్నారు. నగరంలోని ప్రభుత్వ ఆస్తులు, కట్టడాలపై టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు పెట్టడమేమిటని ఉత్తమ్‌ ప్రశ్నించారు. అవేమన్న వారు సంపాదించిన ఆస్తులా అంటూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ప్రభుత్వానికి చెందిన ఆస్తులపై టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ప్రచార చిత్రాలు వేయడానికి ఎలా అనుమతిస్తారని ఈసీని నిలదీశారు ఉత్తమ్‌. హైదరాబాద్‌లోని మెట్రో పిల్లర్లు, బస్ షెల్టర్లు, టాయ్‌లెట్లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలపై ఇలా ఎక్కడ చూసినా కేసీఆర్‌, కేటీఆర్ బొమ్మలే కనబడుతున్నాయని పీసీసీ చీఫ్‌ ఫైర్‌ అయ్యారు. నగరాన్ని ఏమైనా వారికి రాసిచ్చారా అంటూ నిలదీశాడు. దీనికి సంబంధించి జీహెచ్‌ఎంసీ, ఎన్నికల కమిషనర్లు సిగ్గుపడాలని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు.

Exit mobile version