Knee Pains: గతంలో 60 ఏళ్లు దాటిన తర్వాతే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వచ్చేవి. కానీ ఇప్పుడు ఈరోజుల్లో చిన్న వయసు లో ఈ సమస్యలు మొదలుఅవుతున్నాయి. ఈ సమస్య ఉంటే లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. అసమతుల్య జీవనశైలి(Uncontrolled LifeStyle), చెడు ఆహార అలవాట్ల (food habits) కారణంగా చిన్నవయసులోనే కీళ్లనొప్పుల సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఈ మోకాళ్ల నొప్పులు మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లేకుంటే కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు(nutrition) చెబుతున్నారు. అయితే ఈ రోజుల్లో చాలామంది మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వయసు పెరిగేకొద్దీ దీర్ఘకాలిక నొప్పులు(longterm pains) మొదలవుతాయి. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
(మెంతులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు)
కాల్షియం(Calcium) ఎముకలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా కారణం వల్ల మీకు కీళ్ల నొప్పులు ఉంటే మీరు మరికొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలం, చలికాలంలో కీళ్ల నొప్పులు గణనీయంగా పెరుగుతాయి. ఈ పరిస్థితిలో మీరు ఆహారంలో మార్పులు చేయడమే కాకుండా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. మీరు చిన్నప్పటి నుంచి కాల్షియం ఎక్కువగా తీసుకుంటే ఇది మీ సమస్యలను తగ్గిస్తుంది.
(Walking Benefits : వాకింగ్ వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు )
పాలు(milk) మీ ఎముకలను బలోపేతం(Stong Bones) చేయడానికి, కండరాలను అభివృద్ధి చేయడానికి బాగా ఉపయోగపడుతాయి. పాలలో ప్రోటీన్, కాల్షియం అధికంగా ఉంటాయి. అదనంగా ఇందులో భాస్వరం, మెగ్నీషియం, అయోడిన్, విటమిన్లు A, D, K, E వంటి అనేక ఖనిజాలు, కొవ్వులు ఉంటాయి. అందుకే పాలని ఎక్కువ మోతాదు లో తీసుకోవాలి. అల్లం కీళ్ల నొప్పులు, కండరాలకు గొప్ప చికిత్సగా చెప్పవచ్చు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ (anti inflammatory) లక్షణాలు ఉంటాయి. ఇది నొప్పిని తగ్గించడంలో త్వరగా పనిచేస్తుంది. దీనికి ఒక కప్పు పాలలో అల్లం కలిపి తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి నట్స్ ప్రయోజనాల గురించి తెలుసు. వీటిని ప్రతిరోజూ తినేవారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇవి మీ కీళ్ల నొప్పులకు సహాయపడుతాయి. నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ (Omega3 Fat acids) పుష్కలంగా ఉంటాయి. మీరు ప్రతిరోజూ వాల్‌నట్స్, బాదం, అవిసె గింజలతో పాటు పైన్ గింజలను తీసుకుంటే కీళ్ల నొప్పుల ఉపశమనం పొందవచ్చు.