కరోనా(Corona) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా మంది ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి విటమిన్ సంప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. ఇలా విటమిన్(Vitamin Tablet) టాబ్లెట్లు వాడే వారి సంఖ్య ఎక్కువవడంతో డాక్టర్లు పలు సూచనలు చేస్తున్నారు. మోతాదుకు మించి విటమిన్ సప్లిమెంట్స్(Supplements) వాడితే ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ల సిఫార్సు లేకుండా ఎలాంటి విటమిన్ టాబ్లెట్లు వాడకూడదని వారిస్తున్నారు.
విటమిన్ డి.. సంప్లిమెంట్ కంటే సూర్యరశ్మి(Sunshine) ద్వారానే అధికంగా లభిస్తుందనీ, అదే ఉత్తమ మార్గమమని డాక్టర్లు సూచించారు. విటమిన్ సి, డి డోస్‌లు శరీరంలో ఎక్కువైతే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయనీ.. ఈ విటమిన్ ఎక్కువైతే మెదడుపై(Brain) తీవ్ర ప్రభావం పడుతుందని, కె విటమిన్ ఎక్కువైతే రక్తనాళాలు దెబ్బతింటాయని డాక్టర్లు సూచిస్తున్నారు. కావున ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా సొంత వైద్యం కాకుండా డాక్టర్లను సంప్రదిస్తే మంచిది.