end

ఆర్మీ, నేవీ, ఏయిర్ ఫోర్సుల్లో ఉన్నత ఉద్యోగాలు


Carrier: ఆర్మీ, నేవీ, ఏయిర్ ఫోర్సు (Army, Navy, Air Force)ల్లో ఉన్నతోద్యాగాల కోసం యూపీఎస్సీ సీడీఎస్ (UPSCDS)ఈ పరీక్ష నిర్వహిస్తోంది. UPSC- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2023 ప్రకారం డిగ్రీ పూర్తయిన అవివాహిత పురుషులు, మహిళలు సీడీఎస్ఈ – 2023కి దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:
యూపీఎస్సీ – కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1)-2023.

ఖాళీల వివరాలు:
ఇండియన్ మిలటరీ అకాడమీ (IMA), డెహ్రాడూన్ – 100
ఇండియన్ నావల్ అకాడమీ (INA), ఎజిమల- 22
ఎయిర్ ఫోర్స్ అకాడమీ (IFA), హైదరాబాద్ – 32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (Madras), ఓటీఏ ఎస్ఎస్ సీ మెన్ నాన్ టెక్నికల్ – 170
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్ఎస్‌సీ నాన్ టెక్నికల్ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు.
చివరి ఏడాది పరీక్షలు రాసినవారు కూడా అర్హులే.

వయసు:
ఇండియన్ మిలటరీ అకాడెమీ, నావల్ అకాడమీలకు జనవరి 2, 2000 కంటే ముందు.. జనవరి 1, 2005 తర్వాత జన్మించినవారు అనర్హులు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ (Pilot license)ఉన్నవారికి గరిష్ఠ వయసులో రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (Officers Training Academy)పోస్టులకు జనవరి 2, 1999 కంటే ముందు, జనవరి 1, 2005 తర్వాత జన్మించినవారు అనర్హులు.

ఎంపిక:
రెండు దశల్లో ఎంపికచేస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం:
ఒక్కో పేపర్‌కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (English, General Knowledge, Elementary Mathematics) విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు. ఆఫీసర్ ట్రయినింగ్ అకాడెమీ పోస్టులకు (For Officer Training Academy Posts) దరఖాస్తు చేసుకున్నవారు. మ్యాథ్స్ పేపర్ రాయనవసరం లేదు.

ఇంటర్వ్యూ:
ఈ విభాగానికి 300 మార్కులుంటాయి. ఓటీఏ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారికి 200 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి మెరిట్ జాబితా రూపొందిస్తారు.

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో చేయాలి.
చివరితేది: జనవరి 10, 2023
పరీక్ష తేది: ఏప్రిల్ 16, 2023.
ఏపీ (AP) తెలంగాణ (Telangana)లో పరీక్షా కేంద్రాలు:
హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం. (Hyderabad, Warangal, Visakhapatnam, Vijayawada, Tirupati, Anantapur)

వెబ్‌సైట్: https://upsc.gov.in/

Exit mobile version