end

బ్యాంకు దొంగల అరెస్ట్‌..

మెదక్ జిల్లాలో బ్యాంకుల్లో నిత్యం దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులను టేక్మాల్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్ద శంకరంపేట, టేక్మాల్, నారాయణఖేడ్, హత్నూర, నర్సాపూర్, వట్‌పల్లి, మెదక్ టౌన్, పాపన్నపేట్, జోగిపేట్ పోలిస్ స్టేషన్ల పరిధిలోని బ్యాంకుల్లో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులు.. దోవసోత్ బుట్టా, దోవసోత్ రాజులను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పట్టుకొని.. వారి వద్ద నుంచి లక్షా ఐదు వేల నగదు, 2.2 తులాల బంగారం, 4 ఉంగరాలు, 5.5 తులాల వెండి చైన్లు రికవరీ చేసినట్లు తెలిపారు.

నేరస్తులను మీడియా ముందు ఉంచి, వివరాలు తెలిపిన అనంతరం జైలుకు తరలించినట్లు ఎస్పీ ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా, మీడియా సమావేశంలో సీఐ రవి, ఎస్సైలు లింబాద్రి, ఆంజనేయులు.. ఐడీ పార్టీ కానిస్టేబుల్ అరవింద్ కుమార్, మల్లప్ప ఉన్నారు.

Exit mobile version