end
=
Sunday, January 19, 2025
సినీమాAllu Aravind:‘గీతా ఆర్ట్స్’ సీక్రెట్ చెప్పేసిన అరవింద్...
- Advertisment -

Allu Aravind:‘గీతా ఆర్ట్స్’ సీక్రెట్ చెప్పేసిన అరవింద్…

- Advertisment -
- Advertisment -

  • గీతా అనే పేరు గల వ్యక్తి ఎవరు లేరంటూనే

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిటి చిత్రాలను నిర్మించిన నిర్మాణ సంస్థల్లో గీతాఆర్ట్స్ (Geetha Art)ఒకటి.  అయితే అల్లు అరవింద్ (Allu Aravind)నాయకత్వంలో మెగా మూవీస్ (mega movies)అన్నీ దాదాపు ఆ నిర్మాణ సంస్థలోనే విడుదలవుతుంటాయి. మంచి చిత్రాలను నిర్మించే సంస్థగా గీతా ఆర్ట్స్‌కు చిత్ర పరిశ్రమలో (industry)పేరుంది. అయితే ఈపేరు ఎలా వచ్చింది ఎవరు పెట్టారు అన్న విషయాలను అల్లు అరవింద్ ఈ మధ్య ఓ టీవీ (tv channel)ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అల్లు అరవింద్ అధినేతగా ఈ బ్యానర్ (banner)నుంచి వచ్చే సినిమాలు కొత్తదనంతో.. బలమైన కంటెంట్‏తో (content) ఉంటాయనే నమ్మకం ప్రేక్షకులలో (audions)ఉంది. ఇప్పటివరకు భారీ బడ్జెట్ (budget)చిత్రాలు మాత్రమే కాకుండా బలమైన (strong)కథాకథనాలు ఉంటే చిన్న సినిమాలను కూడా ప్రోత్సహిస్తుంది గీతాఆర్ట్స్. అయితే అల్లు ఫ్యామిలీలో (family)గీతా అనే పేరు గల వ్యక్తి ఎవరు లేరు. కానీ నిర్మాణ సంస్థకు మాత్రం గీతా అనే పేరు ఉండడంతో అసలు ఎవరు ఈ గీతా ? అనే సందేహాలు చాలా కాలంగా జనాల్లో ఉండిపోయాయి. ఈ విషయం తెలుసుకోవాలనే కుతూహలం కూడా చాలా మందిలో ఉంది. అయితే ఎట్టకేలకు గీతా పేరు వెనక ఉన్న అసలు కథ (story)చెప్పేశారు నిర్మాత అల్లు అరవింద్. దివంగత సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య(Allu Ramalingaiah) శత జయంతి (100 YEARS)ఉత్సవాల సందర్భంగా ఇటీవల అలీతో సరదాగా షోలో (ALITHO SARADAGA)పాల్గోన్న అల్లు అరవింద్ తన వ్యక్తిగత విషయాలే కాకుండా ఫ్యామిలీ విషయాలను పంచుకున్నారు.

(Allu Arjun : బర్త్ డే సర్ ప్రైజ్ కి రెండు కోట్లు ఖర్చు)

ఈ మేరకు గీతాఆర్ట్స్‏లో గీత ఎవరు ? ఆ పేరు వెనుక ఏదైనా కథ ఉందా ? అని అలీ అడగ్గా.. ‘గీతా ఆర్ట్స్ అనే పేరు (NAME) పెట్టింది మా నాన్న (FATHER). భగవద్గీత సారాంశం నచ్చి ఆ పేరు పెట్టారు. ప్రయత్నం మాత్రమే మనది. ఫలితం (Result)మన చేతిలో ఉండదు. ఇది సినిమాలకు బాగా సరిపోతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యడమే కానీ, ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. అని గీతా పేరు పెట్టారు’ అని స్పష్టం చేశారు. అలాగే నిర్మాతలు (producers)ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి సినిమా (cenima)తీస్తున్నారు. కానీ, ఫలితం ఆడియన్స్ చేతిలో ఉంటుంది. నచ్చితే హిట్ (hit)చేస్తారు. లేదంటే ఫట్ (fail).. పెట్టిన పెట్టుబడి కూడా రాదు ఒక్కోసారి. అదృష్టం (luck)బావుంటే దానికి డబుల్ (double)కూడా వస్తుంది. అందుకే  ఆ పేరు పెట్టారని వివరించాడు. ఈ క్రమంలోనే తాను చిరంజీవితో (chiranjeevi) తీసిన అన్ని చిత్రాలు దాదాపు హిట్టయ్యాయని తెలిపారు.

ఇక రాంచరణ్‌తో (ram charan)తీసిన ‘మగధీర’ (magadheera)తనదగ్గర ఉన్నదంతా పెట్టుబడి పెడితే దానికి మూడింతలు లాభం వచ్చిందని తెలిపారు. అందుకే ‘గీతా ఆర్ట్స్’ పేరు మార్చాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదన్నారు. ఇక చదువుకునే రోజుల్లో తనకు గీత అనే గర్ల్‌ఫ్రెండ్ (girl friend)ఉండేదట. స్నేహితులు కూడా ఆ పేరుతో ఆటపట్టించేవారని అరవింద్ కాలేజీ రోజుల్ని(college)గుర్తు చేసుకున్నాడు.  ఇదిలావుంటే ఇటీవల చిరంజీవితో మనస్పర్థలున్నాయనే వార్తలపై కూడా స్పందించిన ఆయన.. అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు. చిరంజీవి కేవలం బావగానే కాదు మంచి స్నేహితుడు కూడా అంటూ రూమర్స్‌కు (rumours)పులిస్టాప్ పెట్టాడు.

(Filmfare:ఫిల్మ్ ఫేర్‌లో ‘పుష్ప’ హవా..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -