end

ఎస్‌ఐపై దుండగలు కత్తితో దాడి

  • హైదరాబాద్‌లోని మారేడుపల్లి పరిధిలో ఘటన

ఎస్‌ఐపై దుండగులు కత్తితో పొడిచిన ఘటన హైదరాబాద్‌లోని మారేడుపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … మంగళవారం రాత్రి రెండు గంటల సమయంలో మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎస్ఐ వినయ్‌కుమార్‌ తన సిబ్బందితో కలిసి పాట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఒక బైక్‌ను ఆపి విచారించగా ఆ బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఎస్‌ఐ వినయ్‌కుమార్‌ కడుపులో పొడిచి పరారయ్యారు. దీంతో ఎస్‌ఐ తీవ్రంగా గాయపడ్డారు. సిబ్బంది వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఎస్‌ఐ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు చర్యలు ముమ్మరం చేశారు.

ఇవికూడా చదవండి

Exit mobile version