end

Munugode:మునుగోడులో ఈటలపై దాడి..

  • వ్యూహం ప్రకారమే చేశారన్న కిషన్ రెడ్డి
  • ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ సిరీయస్


మునుగోడు (munugode) ఉప ఎన్నికల ప్రచారం (Election campaign) రసవత్తరంగా సాగింది. ప్రధాన పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ పోటాపోటీ ప్రచారం నిర్వహించాయి. అయితే ఈ క్రమంలోనే కొన్ని ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటగా బీజేపీ (BJP)అభ్యర్థి రాజగోపాల్‌కు (RAJAGOPAL)చెప్పులు చూపించిన సంఘటన పార్టీ వర్గాలను ఆశ్చర్యపరచగా ప్రచారం చివరిరోజు ఎమ్మెల్యే (MLA) ఈటల రాజేందర్ (Etela Rajender) కాన్వాయ్‌పై దాడి జరిగింది. మునుగోడు మండలం పలివెల (Palivela) గ్రామంలో ఈటల రాజేందర్‌ ప్రచారం చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పలు వాహనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. ఇరు వర్గాల ఘర్షణతో పలివెలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

అయితే ఈ ఘటనపై ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. చోద్యం చూస్తున్నారా అంటూ పోలీసులపై (police)ఈటల ఆగ్రహం వ్యక్తంచేశారు. కావాలనే రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇరువర్గాలు ప్రచారం చేస్తున్న క్రమంలో ఈ దాడి (attack) జరిగినట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్(TRS), బీజేపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఇరువర్గాలు కర్రలతో, రాళ్లతో దాడి చేసుకున్నాయి. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఇరువర్గాల కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల పరస్పర దాడులతో పలివెలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలివెల ఘటనపై ఎన్నికల కమిషన్ సిరీయస్ (ELECTION COMMISSION SERIUS)అయింది. పలివెలకు వెంటనే.. అదనపు బలగాలను పంపాలని ఆదేశాలు జారీ చేసింది. భద్రతను (Security)మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.

వ్యూహం ప్రకారమే ఈటలపై దాడి:


మునుగోడులో ఓడిపోతామని తెలిసే టీఆర్ఎస్ దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy)ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ (huzurabad) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై పలివెలలో జరిగిన రాళ్లదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మునుగోడులో ఈటల రాజేందర్ తో కలిసి కిషన్ రెడ్డి మీడియాతో (media) మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో (chandur)హింసను ప్రేరేపించే విధంగా సీఎం కేసీఆర్ (KCR)మాట్లాడారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందన్నారు. ఈటల, ఆయన కుటుంబసభ్యుల ఫోన్లపై (Phone) నిఘా పెట్టారని ఆరోపించారు. వ్యూహం ప్రకారమే ఈటల రాజేందర్, ఆయన భార్యపై దాడికి పాల్పడ్డారని కిషన్ రెడ్డి అన్నారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి (palla rajeshwar reddy)అనుచరులతో వచ్చి దాడి చేశారన్న కిషన్.. డీసీఎం (dcm)వ్యాన్లలో రాళ్లు, కర్రలు తెచ్చుకుని దాడికి పాల్పడ్డారన్నారు. ఇంత జరిగినా గొడవ జరగొద్దనే ఉద్దేశంతోనే ఈటల రాజేందర్ సంయమనం పాటించారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇటీవల టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చి తన సభను కూడా అడ్డుకున్నారన్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఫలితంతో (result)టీఆర్ఎస్ కాలుకాలిన పిల్లిలా తయారైందని ఎద్దేవా చేశారు. పోలీసులు టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని దాడులు చేసినా బీజేపీ కార్యకర్తలు భయపడరని అన్నారు. ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేతల కార్లను తనిఖీ చేయడం లేదని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నికలో గెలవరనే టీఆర్ఎస్ తమపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. మునుగోడు ప్రజల తీర్పు (Judgment of the people)తో చెంప ఛెళ్లుమంటుందన్నారు. టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ (sudarshan)సమక్షంలోనే దాడులకు పాల్పడ్డారని తెలిపారు. పలివెల గ్రామంలో టీఆర్ఎస్‌కు బేస్ (base) లేదని విమర్శించారు. మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేక భౌతిక (physical)దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి చిల్లర వేషాలు, చిల్లర దాడులు కొత్తేమీ కాదన్నారు. కేసీఆర్ గూండాయిజానికి మేం భయపడం. పక్కా ప్లాన్ (plan)తో మాపై దాడి చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన రాళ్ల దాడిలో దాదాపు 15 ప్రచార రథాలు, వాహనాలు (vehicles)ధ్వంసం అయ్యాయి అని ఈటల రాజేందర్ తెలిపారు. కాగా, టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను ఈటల రాజేందర్ పరామర్శించారు. ప్రస్తుతం బాధితులంతా ఆస్పత్రుల్లో (hospital) చికిత్స పొందుతున్నారు.

ఇదిలావుంటే.. అలాగే ఫోన్ల ట్యాపింగ్‌ (Phone taping)పై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. తెలంగాణలో తమ నేతల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని ఈసీ (EC) దృష్టికి తీసుకెళ్లింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు తమ నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారు ఫిర్యాదు చేశారు పార్టీ ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌ (tarun chug). మరోవైపు ఎటువంటి ఆధారాలు (proofs) లేకుండా తమ నేతల విషయంలో నగదు లావాదేవీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకోవైపు ఉద్యోగ సంఘాలు టీఆర్‌ఎస్‌ కోసం ప్రచారం చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు బీజేపీ నేతలు. ఎటువంటి ఆధారాలు లేకుండా నగదు లావాదేవీలపై అక్రమంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

అయితే ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి తంగేళ్ల శివ ప్రసాద్‌రెడ్డి (shiva prasad)ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో ఈ రచ్చ మొదలైంది. ఎమ్మెల్యేలు, సామాన్యుల ఫోన్‌లను తెలంగాణ సర్కార్‌ ట్యాప్ చేస్తోందంటూ ఈసీకి తంగేళ్ల శివ ప్రసాద్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఎన్నికల కమిషన్ స్వీకరించింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ (indian telegraph act) ప్రకారం సెక్షన్ 5(2) (section)నిబంధనల్లో ఫోన్ ట్యాప్ చేయడం విరుద్ధమని శివ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

(Munugode:రాజగోపాల్ రెడ్డికి చెప్పులు చూపించిన ఓటర్లు..)

Exit mobile version