- టీఆర్ఎస్ నేతలపై బీజేపీ సంచలన ఆరోపణలు
- ఇది మొదటిసారి కాదన్న ఈటల రాజేందర్
తెలంగాణలో టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ (TRS Vs BJP) రాజకీయం రోజురోజుకు మరింత వెడుక్కుతోంది. ఎంపీ అరవింద్ (MP Aravind)ఇంటిపై టీఆర్ ఎస్ కార్యకర్తల దాడితో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే ఈట రాజేందర్ (Etela Rajender) మీడియాతో మాట్లాడుతూ సంచల కామెంట్స్ చేశాడు. అధికార పార్టీ నాయకులు మాజీ నక్సలైట్లతో (Former Naxalites) కలిసి దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్నాడు. అంతేకాదు వాళ్లు ఇలా చేయడం మొదటిసారి కాదన్న ఎమ్మెల్యే ఐఏఎస్, ఐపీఎస్ (IAS, IPS)అధికారులు పైనుంచి ఆదేశాలు అని చెప్తున్నారని మండిపడ్డారు. అలాగే తాము ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్లమని, అలాంటి తమపై మాజీ నక్సలైట్లను కూడగట్టుకొని దాడులు చెయ్యాలని పథకం వేస్తున్నారంటూ ఆరోపించారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి పథకం ప్రకారమే దాడి జరిగిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అర్వింద్ తల్లి విజయలక్ష్మి (Vijayalakshmi)ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం. ప్రజల పక్షాన ఉన్న వారిని, ప్రశ్నించే వారిని భయపెట్టడానికి ఈ దాడులు చేస్తోంది. పోలీసుల (Police) పహారాలో రాజ్యం నడుపుతున్నారు. నైరాశ్యంతో సహనం కోల్పోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. కాళ్ళకింద భూమి కదిలిపోయి గెలవలేమని దాడులు చేస్తున్నారు. ఎంపీ ఇంటిమీద పోలీసుల పర్యవేక్షణలోనే ఈ దాడి జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దాడులను తెలంగాణ సమాజం గమనిస్తుంది. తప్పకుండా త్వరలోనే తెలంగాణ ప్రజానీకం టీఆర్‌ఎస్ నాయకులకు సరైన బుద్ధి చెబుతుంది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
(Traffic Police:వాహనదారులకు అలెర్ట్)
అలాగే ఇలా దాడి చేయడం వారికి ఇది మొదటిది కాదన్న ఆయన.. బండి సంజయ్ (Bandi sanjay) పాదయాత్రలో కూడా ఇలాంటి దాడులే జరిగాయన్నారు. మునుగోడు (Munugode) ఎన్నికల్లో భయ బ్రాంతులు సృష్టించేందుకు రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy)కూడా మీద దాడి చేశారని మండిపడ్డారు. తన అత్త గారి ఊర్లో భార్యతో, గ్రామ మహిళలతో ఉండగా తన మీద దాడి చేశారని గుర్తు చేశారు. ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్లు, నర్సంపేట ఎమ్మెల్యే, పల్లా రాజేశ్వర్ రెడ్డి (Narsampet MLA Palla Rajeshwar Reddy) దాడికి దిగారని చెప్పుకొచ్చారు. కర్రలకు మేకులు కొట్టుకొని, బస్తాల్లో రాళ్ళు నింపుకొని వచ్చి తమ రక్తం కళ్ళజూసారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ దాడులపై కేంద్ర మంత్రి అమిత్ షా (Union Minister Amit Shah)కు వివరంగా ఉత్తరం రాసినట్లు తెలిపారు. ప్రతిపక్ష నాయకుల ప్రాణాలు కాపాడడంలో ప్రజలకు రక్షణకల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘మాకు రక్షణ లేకుండా పోయింది. అసెంబ్లీకి (Assembly)రానివడం లేదు. చట్టం చెల్లదు నేనే చండశాసనుడిని అన్నట్లుగా కెసీఆర్ (KCR) వ్యవహరు.
సీఎం కెసీఆర్ స్వయంగా ఎల్పీ మీటింగ్‌లో బీజేపీ వారిమీద దాడులు చేయండి నేను చూసుకుంటా అని చెప్పారంటే ఏం అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్సీ ఒక మహిళ అయి ఉండి కూడా కొట్టి కొట్టి చంపుతామని మాట్లాడుతారు. ఎటు పోతున్నాం. మనమిచ్చిన అధికారంతో మన మీదనే దాడులు చేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. కేంద్రానికి నివేదిస్తాం. రాష్ట్రం విఫలం అయినప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పైనుంచి ఆదేశాలు అని చెప్తున్నారు. మేము ప్రజలను, ప్రజాస్వామ్యం (Democracy) నమ్ముకున్న వాళ్ళం. మాజీ నక్సలైట్లను కూడగట్టుకొని దాడులు చెయ్యాలని పథకం వేస్తున్నారట. అమిత్ షాకి ఆ నివేదిక కూడా పంపుతాం. కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారనేది కాదనలేని సత్యం. హిట్లర్ (Hitler) ముస్సొలి (Mussolini) అనుకుంటున్నారు. వారికి పట్టినగతే ఈయనకు పడుతుంది. అలాంటి పిచ్చి వేషాలకు ఈ దేశంలో అవకాశం లేదు’ అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హెచ్చరించారు.