- ఏపీ పంచాయతీ ఎన్నికలలో దారుణం
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాజాగా జరిగిన ఏపీ పంచాయతీ ఎన్నికలలో కొందరు ఓటర్లు తమ మద్దతుదారులకు ఓటు వేయలేదనే అక్కసుతో టీడీపీ నేతలు ఇళ్లపై దాడులు చేశారు. శ్రీకాకుళం జిల్లా కింతలీ పంచాయతీ ఖాజీపేటలో ఈ దారుణం జరిగింది. అర్ధరాత్రి సమయంలో యాదవ వీధుల్లో ఉన్న ఇళ్లపై కర్రలు, రాళ్లు విసిరారు.

అదేగాకుండా గునపాలతో ఇండ్ల గోడలను ధ్వంసం చేశారు. ఇంటి తలుపు, కిటికీలు, బైకులు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడినట్లు వైయస్సార్ సీపీ నేతలు చిరంజీవినాగ్, వెంకటరమణ తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన చాలా బాధాకరమని, దీనికి సంబంధించిన బాధ్యులను వదలబోమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.