end

కోహ్లి గైర్హాజరీతో ఆసీస్‌కే ప్రయోజనం: గవాస్కర్‌

టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. మూడు ఫార్మాట్లలో ఇరు జట్లు సుదీర్ఘకాలం తలపడనున్నాయి. కాగా, కెప్టెన్విరాట్ కోహ్లి టీ 20, వన్డే సిరీస్‌లకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడు. కానీ, ఆసీస్‌తో జరిగే నాలుగు టెస్టుల్లో కోహ్లి ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడతాడు. అనంతరం అతడు వెటర్నరీ లీవ్‌పై ఇండియాకు తిరిగిరానున్నాడు. అతని స్థానంలో రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కాగా, ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టుతో తలపడేటప్పుడు టీమిండియా స్కిప్పర్‌ విరాట్‌ లేకపోవడం వల్ల ఆతిథ్య దేశానికి ప్రయోజనం చేకూరుతుందంటున్నాడు భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌. అతడు లేని లోటు జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నాడు.

కాగా, ప్రస్తుతం టీమ్‌లోని సభ్యులంతా కీలకమేనని సన్నీ అభిప్రాయం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులంతా సమిష్టిగా ఆడితే.. గత సిరీస్‌ విజయం పునరావృతమవుతుందిని గవాస్కర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. సెలెక్షన్‌ కమిటీ కెప్టెన్సీ విషయంలో తీసుకున్న నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చని గవాస్కర్‌ అన్నారు. ఈ నెల 27 నుంచి సిరీస్‌ ప్రారంభవనుండగా.. ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారు.

Exit mobile version