end
=
Friday, September 20, 2024
క్రీడలుభారీ ఆధిక్యం దిశగా ఆసీస్‌..
- Advertisment -

భారీ ఆధిక్యం దిశగా ఆసీస్‌..

- Advertisment -
- Advertisment -

సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యతను కలుపుకొని మొత్తంగా 197 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్‌ 4 వికెట్లతో చెలరేగగా.. హెజెల్‌వుడ్‌ 2, స్టార్క్‌ ఒక వికెట్‌ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఇన్సింగ్స్‌లో అర్ధ సెంచరీతో రాణించిన ఓపెనర్ విల్‌ పుకవ్‌స్కీ ఈసారి 10 పరుగులకే వెనుదిరిగాడు. సిరాజ్ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 35 పరుగుల వద్ద మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(13 పరుగులు) కూడా పెవిలియన్ చేరాడు.

35 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు ఔటవడంతో లబుషేన్, స్మిత్‌లు ఆచితూచి ఆడారు. మరో వికెట్ పడిపోకుండా జాగ్రత్తపడ్డారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఫలితంగా భారత్‌పై 197 పరుగుల ఆధిక్యం సాధించింది. లబుషేన్ 47, స్టీవ్‌ స్మిత్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ తొలి ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్లుగా నిలిచిన విషయం తెలిసిందే. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉండడంతో ఆసీస్‌ గెలుపుపై గురి పెట్టింది. ఆసీస్‌ గెలుపును అడ్డుకోవడంలో భారత్‌ తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించడంలో సఫలమవ్వాలి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -