కాన్‌బెర్రా: ఇండియా జట్టు.. ఆసీస్‌తో మూడు టీ20 మ్యాచులు ఆడబోతోంది. ఇవాళ తొలి మ్యాచ్ జరగనుండగా.. మొదట టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా.. బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరగ్గా 2-1తో ఆసీస్ కైవసం చేసుకుంది. ఎలాగైనా ఈ సిరీస్ నెగ్గి వన్డేల్లో ఎదురైన పరాభవాన్ని తుడిచేయాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. భారత ప్రధాన బ్యాట్స్‌మెన్ కెప్టెన్ కోహ్లి, రాహుల్, ధావన్, పాండ్యా ఫామ్‌లోకి రావడం శుభ పరిణామం.
జట్లు:
ఇండియా: శిఖర్ ధావన్, రాహుల్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లి(కెప్టెన్), మానిష్ పాండే, సంజూ సాంసన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, సుందర్, దీపక్ చాహర్, షమీ, నటరాజన్.
ఆస్ట్రేలియా: ఆర్సీ షార్ట్, ఫించ్(కెప్టెన్), మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), స్టీవెన్ స్మిత్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, మిచ్ స్వెప్సన్, సీన్ అబాట్, స్టార్క్, జంపా, హెజెల్‌వుడ్.