- తెలంగాణ సాధించిన కూడా ఉపాధి, ఉద్యోగాలు కరువు
- యువ ఆటో డ్రైవర్ చందర్ ఆవేదన
- ప్రగతిభవన్ ముందు కిరోసిన్ పోసుకొని ఆత్మాహత్యాయత్నం
తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, చివరికి తెలంగాణ సాధించిన తర్వాత కూడా నిరుద్యోగం వెంటాడుతోందని హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ వద్ద ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతన్ని అడ్డుకున్నారు. అటో ఆటో డ్రైవర్ చందర్ అనే వ్యక్తి తెలంగాణ కోసం 2010లో అసెంబ్లీ వద్ద ఆత్మాహత్యం చేసుకున్నానని చెప్పాడు.
దేశద్రోహం… పాకిస్తాన్ మిలిటరీకి కీలక సమాచారం
ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ సాధించుకుంటే ఇంకా నిరుద్యోగం, పేదరికం వెంటాడుతున్నాయని, ప్రభుత్వం నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ అవి నిరుపేదలకు చేరడం లేదని, కేవలం అధికారంలో ఉన్న నాయకుల సన్నిహితులకు, లేదా ఎమ్మెల్యేలు రికమండ్ చేసిన వారికి మాత్రమే ఇండ్లు కేటాస్తున్నారని వాపోయాడు.