- బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు సరైంది కాదు
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తమకు అన్యాయం జరిగిందని స్పెషల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజెపీ అగ్రనేతలతో సహా 32 మంది నిందితులకు లక్నో ప్రత్యేక న్యాయస్థానం క్లీన్ చిట్ ఇవ్వడం సరైన పద్దతి కాదని సీనియర్ సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలి అన్నారు.
నవంబర్ 2 నుండి పాఠశాలలు ప్రారంభం
ఈ కేసులో 300 మందికి పైగా సాక్ష్యుల స్టేట్మెంట్లు రికార్డు చేసింది కోర్టు. నిందితులు స్టేజీపై కూర్చొని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఐపీఎస్ అధికారులు, జర్నలిస్టులు సాక్ష్యం ఇచ్చారని, సీబీఐ కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోలేదని ఆయన తెలిపారు. బాబ్రీ కూల్చివేతకు పాల్పడ్డారని సీబీఐ కోర్టు తన తీర్పులో పేర్కొనడం సరికాదన్నారు. అయితే దీనిపై కచ్చితంగా హైకోర్టుకు వెళతామని ముస్లిం లా బోర్డు సభ్యుడు, సీనియర్ న్యాయవాది జాఫర్యాబ్ జిలానీ కూడా స్పష్టం చేశారు.