end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంరోడ్డు ప్రమాదంలో నెలల పసికందు మృతి
- Advertisment -

రోడ్డు ప్రమాదంలో నెలల పసికందు మృతి

- Advertisment -
- Advertisment -
  • హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఘటన
  • పరారీలో కారు డ్రైవర్‌

రోడ్డు ప్రమాదంలో రెండు నెలల పసికందు మృతి చెందిన హృదయవిదాకర సంఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి వద్ద జరిగింది. మహారాష్ర్టలకు చెందిన మహిళ కాజల్‌ చౌహాన్‌ బాబు(అశ్వతోష్‌)తో రోడ్డు దాటబోతుండగా వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి మహిళను ఢీకొట్టింది. దీంతో ఆ పసిపాప కిందపడింది. తలకు తీవ్రంగా గాయాలు కాగా ఆ పాప అక్కడికక్కడే మృతి చెందింది.

కారు డ్రైవర్‌ కారును అక్కడే వదిలేసి పారారయ్యాడు. తీవ్రంగా గాయపడిన కాజల్‌ చౌహాన్‌ ను అపోలో హాస్పిటల్‌కు తరించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాద వివరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు. కాగా ఆ కారుపై నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎమ్మెల్యే పేరుతో స్టిక్కర్‌ ఉండడం గమనార్హం

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -