end

బిడ్డా లే..కళ్లు తెరువు..

  • రోడ్డు ప్రమాదంలో విద్యార్ధి మృతి
  • కన్నీరుమున్నీరైనా తల్లిదండ్రులు

అమ్మా బై బై… నాన్న టాటా.. జాగ్రత్త బిడ్డా… సరే మమ్మి.. అంటూ రోజులాగానే స్కూలుకు బయలుదేరిన అభంశుభం తెలియని ఆ పాపను మృత్యువు వెంటాడింది.కొద్ది క్షణాల క్రితమే తమతో ఉండి… మాట్లాడి… ఇక వెళ్తున్న… మమ్మి అంటూ బయలుదేరిన ఆ బిడ్డా మరణవార్త విన్న ఆ పేగు బంధం తల్లడిల్లింది… బిడ్డా.. లే..కళ్లు తెరువు బిడ్డా.. నేను వచ్చాను….డాడీ వచ్చాడు.. అంటూ ఆ తల్లి విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

ఈ హృదయ విదారక సంఘటన పలువురిని కలిచివేసింది.సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. పోలీసుల కథనం ప్రకారం అక్కారం గ్రామానికి చెందిన బుడిగే యాదగిరి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. కాగా చిన్నకూతురు మోడల్ స్కూల్ ల్లో 7 వ తరగతి చదువుతుంది. రోజు లాగానే తండ్రి, కూతుళ్లు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. కాగా ఇంటిగ్రేటెడ్ ఆఫీసు వద్దకు వచ్చేసరికి ఓ ట్రాక్టర్ అకస్మాత్తుగా రావడం..ముందు కంచె ఉండడంతో వారి బైక్ డి వై డర్ను ఢీకొంది. దీంతో తండ్రి కూతుళ్లు ఇద్దరు పడగా వెనుక వస్తున్న ట్రాక్టర్ కూతురు తల మీద నుంచి వెళ్లగా ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తండ్రి గాయపడగా ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి , కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version