end
=
Friday, September 20, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌మనసున్న సర్పంచ్
- Advertisment -

మనసున్న సర్పంచ్

- Advertisment -
- Advertisment -
  • సొంత డబ్బులతో బడిబాట
  • విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్‌, యానిఫామ్‌
  • రూ. 500 నగదు

ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్ధులు చదువుకోవాలని.. తన సొంత డబ్బులతో “బడి బాట” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మిగిలిన గ్రామాల సర్పంచ్‌లకు ఆదర్శంగా నిలిచారు ఆ మహిళా సర్పంచ్. అందుకే తనకున్న దాంట్లో నలుగురికి సహాయం చేయాలని కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ సర్పంచ్ దంపతులు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం శాలపల్లి, ఇందిరానగర్‌ గ్రామ సర్పంచ్‌ కొడిగూటి శారదా ప్రవీణ్ దంపతులు ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ దంపతులు రెండు గ్రామాల్లోని స్కూల్‌కి వెళ్లే వయసున్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు “బడి బాట” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరే ఒక్కో విద్యార్ధికి ఉచితంగా పుస్తకాలు, నోట్‌ బుక్స్, యూనిఫామ్‌తో పాటు ఒక్కొక్కరికి నెలకు రూ .500 చొప్పున నగదు అందిస్తానని ప్రకటించారు.

బడిబాట కార్యక్రమం ద్వారా కొత్తగా కనీసం 50 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు సర్పంచ్ శారద. ఈ రెండు గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం 70 మంది చదువుతున్నారు. 50మంది ని చేర్పించే భాగంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టమని సర్పంచ్ శారదా తెలిపారు. విద్యార్ధులకు డబ్బులు ఇచ్చి మరీ ఎందుకు ప్రభుత్వ స్కూల్‌లో చేర్పిస్తున్నారని అడిగితే గ్రామంలోని పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదవాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

నిరుపేదలకు సహాయం చేయాలన్నదే తమ కోరిక అని అందులో భాగంగానే బడిబాట కార్యక్రమం ద్వారా తమకు తోచిన సాయం చేస్తున్నామని చెప్పారు. గతంలో కూడా గ్రామానికి, గ్రామ ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సర్పంచ్ దంపతులు. ప్రభుత్వ స్కూల్‌కి పంపడం వల్లే తల్లిదండ్రులపై పడే బుక్స్, యూనిఫామ్స్ ఖర్చు కూడా ఉండకూడదనే ఇలా ఒక్కొక్క విద్యార్ధికి నెలకు 500నగదు ఇస్తున్నట్లుగా తెలియజేశారు. తెలంగాణ ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -