end

బీఎస్పీకి ఎదురుదెబ్బ.. షాక్‌లో మాయావతి

ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ)కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో బీఎస్‌పీ అధికార అభ్యర్థి అయిన రామ్జీ గౌతమ్‌కు ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకున్నారు. ఇదే విషయాన్ని వారు రిటర్నింగ్ అధికారులకు తెలియజేశారు. గౌతమ్‌ తరఫున ప్రపోజర్లుగా తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ వారు ఫిర్యాదు చేశారు. ఆతర్వాత కొద్దిసేపటికే వారంతా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ను కలిసేందుకు ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా, 2019లో బీఎస్పీకి భాగస్వామ్య పార్టీగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఇంతటి ఎదురుదెబ్బను చవిచూడటం వారికి ఊహించని షాక్‌ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఎస్‌ పీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ప్రకాష్ బజాజ్ మంగళవారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల కోసం నామినేషన్ వేశారు. తదనంత క్రమంలోనే బీఎస్‌పీకి చెందిన ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎస్‌పీ బాట పట్టారు. బీఎస్‌పీకి ఉద్వాసన పలికిన ఐదుగురు ఎమ్మెల్యేలలో అస్లాం చౌదరి, అస్లాం రైని, ముజ్తబ సిద్ధిఖి, హకమ్ లాల్ బింద్, గోవింద్ జాతవ్ ఉన్నారు.

Exit mobile version