end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంOld City:పాత బస్తీలో దారుణం
- Advertisment -

Old City:పాత బస్తీలో దారుణం

- Advertisment -
- Advertisment -

  • కలకలం రేపిన కంత్రీ మామ నిర్వాకం
  • చిన్నారికి విముక్తి కల్పించిన సౌత్‌ జోన్‌ పోలీసులు


హైదరాబాద్‌ (Hyderabad) పాతబస్తీలో (Old city) దారుణం జరిగింది. ఫలక్‌నుమా (Falaknuma) ఏరియాలో ఓ చిన్నారిని (Girl) అమానుషంగా హింసించిన కంత్రీ మామ నిర్వాకం కలకలం రేపింది. తండ్రిగా ఆదరించాల్సిన వాడే రాక్షసంగా హింసించాడు. ఒళ్లంతా వాతలు పెట్టాడు. బంధువే రాబందువయ్యాడు. కానీ స్పందించే హృదయం ఆ చిన్నారిని సేఫ్‌ హ్యాండ్స్‌కు చేర్చింది. కంత్రీ మామ చెర నుంచి చిన్నారికి విముక్తి కల్పించారు సౌత్‌ జోన్‌ పోలీసులు (South Zone Police).ఏ తండ్రైనా సరే తన బిడ్డను ప్రాణంగా భావిస్తాడు. కానీ అమ్మలేని లోకంలో బంగారు తల్లిని ఒంటరిగా వదిలేసి ఎటో వెళ్లిపోయాడు నాన్న. రోడ్డున (road) పడిన ఆ పసిబిడ్డను ప్రేమించే హృదయం అక్కున చేర్చుకుంది. బేటా మై హునా అంటూ భరోసా ఇచ్చిన ఆ అభయహస్తమే మేనమామ. తండ్రి తరువాత తండ్రి అన్న మాటను నిజం చేశాడని అంతా భావించారు. అయితే హైదరాబాద్‌ పాతబస్తీలో కలకలం రేపింది ఈ అమానుషం. బిడ్డకాలికి ముల్లు తగిలితేనే కన్నవాళ్ల గుండె కన్నీరవుద్ది. అలాంటిది ఒళ్లంతా కాల్చిన వాతలు.. పాపం.. బిడ్డ ఎంత తల్లడిల్లివుంటుందో. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాళ్లే ఇలా అమానుషంగా ఈ చిన్నారిని హింసించారు.

హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీ ఫలక్‌నుమాలో ఈ దారుణం వెలుగుచూసింది. తల్లి (Mother)అనారోగ్యంతో చనిపోయింది. తండ్రి ఎటో వెళ్లిపోయాడు. ఒంటరిగా మారిన చిన్నారిని మేనమామ (Mama) చేరదీస్తే అంతా సంతోషించారు. అభినందించారు. కానీ అతను తీసుకెళ్లింది ప్రేమతో కాదనే నిజానికి ఈ గాయాలే నిదర్శనం. అతను తీసుకెళ్లి చదివించి..పెద్ద చేయడానికి కాదు తన ఇంట్లో చాకిరీ చేయించుకోవడానికి. బిడ్డ ప్రాణం ఎంత.. అని కూడా చూడకుండా పనులు చెప్పడమే కాదు చాలా హింసించేవాళ్లు.ఏడిస్తే ఓదర్చాడానికి అమ్మలేదు.. నాన్న ఉన్నా అతని జాడ లేదు.. ఎవరికి చెప్పుకోలేక.. ఏం చేయలేక నరకయాతన పడింది బిడ్డ. మేనమామ నిర్వాకం పై ఎవరో పోలీసులకు (Police) సమాచారం ఇచ్చారు. సౌత్‌ జోన్‌ డీసీపీ సాయి చైతన్య (DCP Sai Chaitanya) వెంటనే రియాక్టయ్యారు. ఓ స్వచ్చంద ప్రతినిధులతో కలిసి స్పాట్‌కు చేరుకున్నారు. మేనమామ కబంధ హస్తాల నుంచి ఈ బిడ్డను రెస్క్యూ చేశారు. చైల్డ్‌హోమ్‌ (Children’s Home)కు తరలించారు. చిన్నారిని హింసిచన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

(Modi’s convoy:అంబులెన్స్‌కు దారిచ్చిన మోదీ కాన్వాయ్)

పోలీసులు సకాలంలో స్పందించడంతో చిన్నారిని కాపాడగలిగామన్నారు స్వచ్చంద సంస్థ ప్రతినిధులు. నిందితులను శిక్షించడం సహా ప్రభుత్వం ఆచిన్నారిని ఆదుకోవాలని కోరారు. తండ్రి తరువాత తండ్రిలా అండగా వుండాల్సిన వాడే ఇలా అరాచకానికి పాల్పడ్డం అందర్నీ నివ్వెరపర్చింది. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ (demand) చేశారు స్థానికులు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -