end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంజనసేనానిపై బాల్కసుమన్‌ తీవ్ర విమర్శలు
- Advertisment -

జనసేనానిపై బాల్కసుమన్‌ తీవ్ర విమర్శలు

- Advertisment -
- Advertisment -

జనసేన అధినేత, ప్రముఖ నటులు పవన్‌ కళ్యాణ్‌ను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తీవ్రంగా విమర్శించారు. జనసేన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. ఇక ఆ పార్టీ అధినేత పవన్‌ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. అలాంటి వ్యక్తి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీదిగడం హాస్యాస్పదమన్నారు. జనసేనలో గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం పార్టీలో ఉన్నాడో లేడోనని సుమన్‌ ఎద్దేవా చేశారు. తాను పోటీచేసిన రెండు చోట్లా ఓడిపోయిన వ్యక్తి దగ్గరికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వెళ్లి మద్దతు కోరడం వింత పరిణామమని సుమన్‌ అన్నారు.

ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా.. టీఆర్ఎస్‌ విజయాన్ని అడ్డుకోలేరని సుమన్‌ అన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే టీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని సుమన్‌ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ లాంటి పాలన దక్షుడు రాష్ట్రంలోనే లేరని ఈ సందర్భంగా సుమన్‌ వ్యాఖ్యానించారు. తాము గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలిచి, మేయర్‌ దక్కించుకోవడం లాంఛనమేనని ఆయన పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -