Bank of Baroda Jobs : భారత ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడాలో(Bank of Baroda) ఐదేళ్ల ఒప్పంద ప్రాతిపదికన వెల్త్ మేనేజ్‌మెంట్(Wealth Management) విభాగంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు, ఔత్సాహికులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ (BOB Online Application) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అయితే మొత్తం ఖాళీల సంఖ్య 346. వీటిలో సీనియర్ రిలేషన్‌సిమ్ మేనేర్లు (Senior Relationship Manager) – 320, ఈ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్లు(E-Wealth Managers) – 24, సేల్స్ హెడ్ (Sales Head)- 10, ఆపరేషన్స్ హెడ్(operations head) – 01 చొప్పున ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
(Imran Khan Arrest : పాకిస్తాన్ మాజీ ప్రధాని అరెస్టు ?)
అర్హతలు
1) సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్ – డిగ్రీ(Graduation) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. వయస్సు 24-24 ఏళ్ల మధ్య ఉండాలి
2) ఈ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్లు – డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కనీసం 1 సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. వయస్సు 23-35 ఏళ్ల మధ్య ఉండాలి
3) గ్రూప్ సేల్స్ హెడ్ – డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే 10 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. వయస్సు 31-45 ఏళ్ల మధ్య ఉండాలి
4) ఆపరేషన్స్ హెడ్ – డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే 10 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. వయస్సు 35-50 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం
షార్ట్ లిస్టింగ్(Short Listing), పర్సనల్ ఇంటర్వ్యూ (Walk-in-Interview), గ్రూప్ డిస్కషన్(Group Discussion) ద్వారా ఎంపిక చేస్తారు
ఆన్‌లైన్ ధరఖాస్తు చివరి తేది : 20-12-2022
ఇతర వివరాలకు https://www.bankofbaroda.in చూడండి.
(Munugodu Elections : మనుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల)