end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంబతుకమ్మ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి
- Advertisment -

బతుకమ్మ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

- Advertisment -
- Advertisment -
  • రేగోడు ఎస్సై కాశీనాథ్
    బతుకమ్మ, దసరా ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో.. శాంతియుతంగా జరుపుకోవాలని రేగోడు ఎస్ఐ కాశీనాథ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. మండల ప్రజలందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు. కోవిడ్ 19(కరోనా వైరస్‌) పరిస్థితిలలో ప్రజలందరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించి.. బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలన్నారు. బతుకమ్మ ఆడే సమయంలో మహిళలు విలువైన అభరణాలు ధరించినా, వారు వేసుకున్న ఆభరణాలపై జాగ్రత్తలు వహించాలన్నారు. వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని, ఈ సందర్భంగా మంచి వ్యక్తులెవరూ, దొంగలెవరనేది గుర్తించడం కష్టం. కావున ముందు జాగ్రత్తే నివారణ మార్గం అని ఆయన సూచించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేటప్పుడు మహిళలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై కాశీనాథ్‌ ఈ సందర్భంగా మండల ప్రజలకు విన్నవించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -