end
=
Wednesday, November 20, 2024
వార్తలుజాతీయంBBC:మోడీపై BBC తీసిన డాక్యుమెంటరీపై‌ నిషేధం!
- Advertisment -

BBC:మోడీపై BBC తీసిన డాక్యుమెంటరీపై‌ నిషేధం!

- Advertisment -
- Advertisment -

ప్రధాని నరేంద్రమోదీపై (PM Modi) 2002 గుజరాత్ అల్లర్లపై బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) రూపొందించిన డాక్యుమెంటరీ ని ట్విటర్,యూట్యూబ్ ల్లో షేర్ చేయకుండా నిషేధం (Prohibition) విధించారు. డాక్యుమెంటరీ (BBC documentary) ని షేర్ చేయకుండా బ్లాక్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ట్విటర్, యూట్యూబ్ లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ డాక్యుమెంటరీ (BBC documentary) దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా, దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందని, అందువల్ల ఆ డాక్యుమెంటరీ (BBC documentary)ని షేర్ చేయడాన్ని బ్లాక్ చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పబ్లిష్ అయిన వీడియోలను కూడా యూట్యూబ్ (YouTube) డిలీట్ చేసింది. అలాగే ఆ డాక్యుమెంటరీ‌ని లింక్ చేసిన 50కి పైగా ట్వీట్లను ట్విటర్ (Twitter) డిలీట్ చేసింది. అలా డిలీట్ చేసిన ట్వీట్లలో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ (Congress leader Jairam Ramesh)ట్వీట్ కూడా ఉంది.

ప్రధాని మోదీని, భారత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రచార చిత్రంలా ఆ బీబీసీ డాక్యుమెంటరీ (BBC documentary) ఉందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. బ్రిటిష్ వలసవాద మనస్తత్వం అందులో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. ఆ డాక్యుమెంటరీ (BBC documentary) ని కేంద్ర విదేశాంగ, సమాచార ప్రసార, హోం శాఖ సీనియర్లు చూసి, అది భారత దేశ ఔన్నత్యాన్ని, సుప్రీంకోర్టు విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉందని నిర్ణయానికి వచ్చారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను తక్కువ చేసే ప్రయత్నమని వారు విమర్శించారు. ఐటీ రూల్స్ ప్రకారం ఆ డాక్యుమెంటరీ (BBC documentary)ని షేర్ చేయకుండా బ్లాక్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌ (Social media platforms)ను ఆదేశించారు.

(Nagoba jatara:ఘనంగా ప్రారంభమైన నాగోబా జాతర!)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -