వేములవాడ పట్టణంలో గురువారం అత్యంత వైభవంగా జరిగిన బతుకమ్మ వేడుకల్లోటీ ఆర్ కే ఛారిటబుల్ ట్రస్ట్ సైనికులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళలు కరోనా నియమాలు పాటిస్తూ పండగను ఆనందంగా జరుపుకోవాలని ట్రస్ట్ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని జాగ్రత్తలు తెలియజేశారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు మాస్క్ లు ధరించి కరోనా వ్యాధిని తరిమికొట్టాలని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ తమ ప్రాణాలను రక్షించుకోవాలని విన్నవించారు.
పట్టణంలోని బతుకమ్మ తెప్ప, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంతో పాటు ప్రధాన కూడళ్లలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రస్ట్ సభ్యులు సేవలు అందించారు.బతుకమ్మ వేడుకల్లో ప్రజల సంరక్షణ కోసం సామాజిక బాధ్యతతో సేవకులుగా పనిచేసిన టీ ఆర్ కే ట్రస్ట్ సభ్యులను మహిళలతో పాటు స్థానిక ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్, టీ ఆర్ కే వర్కింగ్ కమిటీ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.