end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంNutritional Food 'Beans':భూ గ్రహాన్ని రక్షిస్తున్న ‘బీన్స్’
- Advertisment -

Nutritional Food ‘Beans’:భూ గ్రహాన్ని రక్షిస్తున్న ‘బీన్స్’

- Advertisment -
- Advertisment -


న్యూట్రిషనల్ ఫుడ్‌ ‘బీన్స్’ (Nutritional Food ‘Beans’) వినియోగాన్ని రెట్టింపు చేయడం ద్వారా గ్రహాన్ని రక్షించుకోవచ్చని, జీవన వ్యయ సంక్షోభాన్ని పరిష్కరించుకోవచ్చని వివరిస్తున్నాయి ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ (Environmental Groups). వాతావరణ మార్పు, ఆరోగ్యం, ఆర్థిక సవాళ్లకు ‘యూనిక్ సొల్యూషన్’ (Unique solution)గా పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (Sustainable Development Goals) (SDG2) అడ్వకేసీ హబ్‌ ‘బీన్స్ ఈజ్ హౌ’ (Beans is how)క్యాంపెయిన్ ద్వారా అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది.

పర్యావరణ ప్రయోజనాలు ఏమిటి?
భూమి మీద పోషకాహార లోపంతో బాధపడుతున్న మూడు బిలియన్ల మందికి ‘బీన్స్’ పరిష్కారమని ‘బీన్స్ ఈజ్ హౌ’ క్యాంపెయిన్ ద్వారా వివరిస్తున్నారు. గ్రహం వేడెక్కేందుకు కారణమైన వాయువులలో మూడో వంతు గ్లోబల్ ఫుడ్ ప్రొడక్షన్‌ (Global Food Production) ద్వారానే విడుదలవుతున్నాయి. మొత్తం ఆహార సంబంధిత గ్యాస్‌లో మాంసం వాటా 60 శాతం ఉండగా.. ఒక కిలో గొడ్డు మాంసం (beaf)70 కిలోల ఉద్గారాలను సృష్టిస్తుంది. పశువుల మేత అటవీ నిర్మూలనకు కారణమవుతోంది. కానీ బీన్స్(అన్ని రకాల పప్పులు) జంతు ప్రోటీన్ల కంటే 90 శాతం తక్కువ గ్రీన్ హౌజ్(Green house) వాయువులను విడుదల చేస్తున్నాయి. నత్రజని (Nitrogen)ని నేలలోకి ప్రవేశింపజేసి.. మృత్తికా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎరువుల అవసరాన్ని తగ్గిస్తాయి. ఈ క్రమంలో ప్రతి వ్యక్తి సగటున రోజుకు 112 గ్రాముల మాంసం తీసుకుంటే.. పప్పుల విషయానికి వస్తే మాత్రం అది 21 గ్రాములగానే ఉంది. ఈ అసమతుల్యతను తిప్పికొట్టడం వల్ల గ్రహం మీద ఒత్తిడిని తగ్గించవచ్చు. అందుకే బీన్స్‌ను మరింత సెక్సీగా మార్చేందుకు చెఫ్‌లు కావాలని, తద్వారా ప్రజలకు మరింత చేరువ చేయాలనేదే తమ క్యాంపెయిన్ ఉద్దేశమని చెప్తున్నారు ‘బీన్స్ ఈజ్ హౌ’ కార్యకర్తలు.

(Smoking:థర్డ్ హ్యాండ్ స్మోక్ ప్రమాదమే)

జీవన వ్యయం, ఆకలి సంక్షోభాలకు బీన్స్ పరిష్కారం?
ప్రపంచవ్యాప్తంగా 38 దేశాలలో 43 మిలియన్ల మంది ప్రజలు కరువు లేదా తీవ్రమైన ఆకలి సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. అంటే ఆహార వ్యవస్థలకు స్వల్పంగా షాక్ అయినా వారికి జీవనోపాధి లేకుండా పోతుంది. కానీ బీన్స్ మాంసానికి చౌకైన, ప్రోటీన్-రిచ్ ప్రత్యామ్నాయం. ఎండిన బీన్స్ ధర 500 గ్రాములకు సగటున $1.00 (€0.96) మాత్రమే. గత కొన్ని సంవత్సరాలుగా పాన్-ఆఫ్రికా బీన్ రీసెర్చ్ అలయన్స్ (Pan-Africa Bean Research Alliance) (PABRA)లోని బీన్ పెంపకందారులు 500 కంటే ఎక్కువ కొత్త రకాలను అభివృద్ధి చేశారు. దీని వలన ఈ లెగ్యూమ్ పోషక విలువలు పెరిగాయి. ఈ ఐరన్ రిచ్ బీన్స్‌ చిన్నపిల్లలు, గర్భిణీయేతర మహిళలకు కావాల్సిన 80 శాతం ఐరన్‌ (Iran)ను అందిస్తుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -