end

యాచకుడు అయితేనేం… మానవత్వంలో మారాజు

  • కరోనా సహాయనిధికి లక్ష రూపాయాల విరాళం
  • ‘సామాజిక కార్యకర్త’ గా బిరుదు పొందిన పూల్‌పాండియన్‌

చెన్నై, తమిళనాడుః అతనో బిక్షగాడు, అయితేనేం మానవత్వంలో మరాజు. కోట్లకు కోట్లు డబ్బు ఉండి కూడా పైసా బిక్ష వేయని ధనికులు, సంపన్నులు ఎంతో మంది ఉన్నారు. కానీ తమిళనాడులో చెన్నైకి చెందిన ఓ బిక్షగాడు పూల్‌పాండియన్‌ యాచకం చేస్తూ బతుకీడుస్తున్నాడు. అయితే కరోనా బారిన పడి మరణించడాన్ని చూసి అతని మనసు చలించిపోయింది. దాంతో అతను యాచకం ద్వారా పోగు చేసిన డబ్బును 10వేలు మదురై కలెక్టరేట్‌కు వెళ్లి కరోనా సహాయనిధికి విరాళంగా ఇచ్చాడు. ఇదేగాకుండా గత మూడు నెలలుగా బిక్షాటన చేసిన మొత్తం 90 వేల రూపాయలను కూడా కరోనా బాధితుల కోసం విరాళంగా ఇచ్చాడు. పూల్‌పాండియన్‌ గొప్ప మనసు, ఔదర్యాన్ని గుర్తించిన మదురై కలెక్టర్‌ ‘సామాజిక కార్యకర్త’ అనే బిరుదుతో సత్కరించారు. ప్రశంసా పత్రాన్ని కూడా అందజేశారు.

Exit mobile version