ఇది స్మార్ట్‌ఫోన్ యుగం. ఇప్పుడన్నీ పనులు స్మార్ట్ ఫోన్ ద్వారానే చిటికెలో జరిగిపోతున్నాయి. డబ్బులు పంపడం, బిల్లులు కట్టడం, ఆన్‌లైన్ క్లాసులు, వీడియో కాన్ఫరెన్స్‌లు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచం అంతా అరచేతిలోనే ఉంది. అయితే మొబైల్ తయారీ కంపెనీలు ఎక్కువగా మధ్య తరగతి వినియోగదారులపైనే దృష్టి సారించాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే విధంగా మొబైళ్లను తయారు చేస్తున్నాయి. స్ర్కీన్ సైజ్, కెమెరాలు, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, ర్యామ్, స్టోరేజ్ పరిగిణలోకి తీసుకొని పలు మొబైల్ కంపెనీలు పోటా పోటీగా మధ్య తరగతి వినియోగదారులను ఆకర్శించే విధంగా మార్కెట్‌లోకి కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి.
అయితే ఈ 2021 సంవత్సరంలో రూ.15 వేల లోపు ఉండే కొన్ని మంచి మొబైల్ మోడళ్లను ఇప్పుడు తెలుసుకుందాం.
Mobile Model | Price |
Realme Narzo 20 Pro | Rs. 14,999 |
Realme 7 | Rs. 14,999 |
Infinix Zero 8i | Rs. 14,999 |
Nokia 5.4 | Rs. 13,999 |
Redmi Note 9 Pro | Rs. 12,999 |
Redmi Note 10 | Rs. 11,999 |
Poco M3 | Rs. 10,999 |
Moto G30 | Rs. 10,999 |
Redmi 9 Power | Rs. 10,999 |
ఈ మొబైల్స్‌ను ఆన్‌లైన్ షాపింగ్ అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్టులో కొనవచ్చు. అంతేగాకుండా కొన్ని బ్యాంకులు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై 10 శాతం వరకు రాయితీ కూడా ఇస్తున్నాయి.