end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంపీవీ, ఎన్టీఆర్‌లకు భారతరత్న ప్రకటించాలి
- Advertisment -

పీవీ, ఎన్టీఆర్‌లకు భారతరత్న ప్రకటించాలి

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: తెలుగు గొప్పదనాన్ని దేశ నలుమూలలా చాటిన గొప్ప నాయకులు పీవీ నరసింహారావు, ఎన్టీఆర్‌. వీరిద్దరిపై బీజేపీ కపట ప్రేమ ఒలకబోస్తోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీజేపీ నాయకులు వారి సమాధుల విషయంలో తీసుకుంటున్న శ్రద్ద.. వారికి భారతరత్న పురస్కారం ప్రకటించడంలో చూపించాలన్నారు. రోహింగ్యాలు, విదేశీయులు ఎక్కడ ఉన్నా అది కేంద్ర వైఫల్యమేనని కవిత అన్నారు. రూ. 1,350 కోట్ల వరదసాయం చేశాకే బీజేపీ నేతలు మాట్లాడాలని ఆమె హితవు పలికారు.

కాగా, నగరంలో చాలా ప్రాంతం కబ్జాకు గురైందని.. అందుకు టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు కారణమని బీజేపీ నేత బండి సంజయ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. అదే విషయమై ఎంఐఎం నేత అక్బరుద్ధీన్‌ ఓవైసీ.. హుస్సేన్‌ సాగర్‌ ప్రస్థావన తీసుకువచ్చి, సాగర్‌ కూడా కబ్జాకు గురైందనీ.. అక్కడ అక్రమంగా నిర్మించిన పీవీ నరసింహారావు, ఎన్టీఆర్‌ల సమాధులను కూడా కూల్చేయాలని ఎన్నికల ప్రచారంలో అన్నారు. దీంతో, బీజేపీ నాయకులు.. తెలుగు నేతలు, హిందువుల సమాధులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు. తెలుగు నేలపై వెలిసిన గొప్ప నాయకులు వారని బీజేపీ నేతలన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -