end

భోలక్‌పూర్‌ కార్పొరేటర్‌ అరెస్టు

పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన భోలక్‌పూర్‌ కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ను ముషీరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇటీవల హైదరాబాద్‌లోని భోలక్‌పూర్‌కు చెందిన కొర్పోరేటర్‌ గౌసుద్దీన్‌ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ అది చివరికి మంత్రి కేటీఆర్‌ వరకు వెళ్లింది. దీంతో ఆయన స్పందిస్తూ పోలీసుల విధులకు ఆంటకం కలించినవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించవద్దని సూచించారు.

ఇదీ సంగతి …

సోమవారం రాత్రి పోలీసులు అర్ధర్రాతి భోలక్‌పూర్‌ ప్రాంతంలో పాట్రోలింగ్‌ నిర్విహిస్తూ దుకాణాలను మూసి వేయాలని సూచించారు. కానీ రంజాన్‌ సందర్భంగా దుకాణాలు నడిపిస్తున్నట్లు యజమానులు పోలీసులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన భోలక్‌పూర్‌ కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ పోలీసులపై దుర్భాషలాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయి అది చివరికి మంత్రి కేటీఆర్‌ వరకు వెళ్లింది.

Exit mobile version