- మోడీ సమక్షంలో రెండోసారి ప్రమాణ స్వీకారం
- కేబినెట్‍లో 16 మంది మంత్రులు
- 11 మంది మాజీ మంత్రుల చేరిక
గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం(Oath taking) చేశారు. గాంధీనగర్‌లోని హెలిప్యాడ్ (Helipad)మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ రాష్ట్ర సీఎంతో పాటు 16 మంది మంత్రులచేత సోమవారంప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ(PM Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ పాలిత రాష్టాల సీఎంలు యోగి ఆదిత్య నాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు హాజరయ్యారు. భూపేంద్రతో పాటు మరో 16 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు వీరిలో 8 మంది కేబినెట్ హోదా కలిగిన మంత్రులు కాగా ఇద్దరు స్వతంత్ర, ఆరుగురు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసిన 11 మందికి భూపేద్రం కేబినెట్లో(Cabinet) చోటు దక్కింది. గుజరాత్ అసెంబ్లీకి(Gujarat Assembly) ఇటీవలే జరిగిన ఎన్నికల్లో 182 స్థానాలకు గాను 156 స్థానాలు గెల్చుకున్న బీజేపీ వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి భూపేంద్ర 1.92 లక్షల ఓట్ల మెజారిటీ గెలుపొందడమూ రికార్డే.
(King Pateria:మోడీని చంపడానికి సిద్ధంగా ఉండండి)
ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి 200 మంది సాధువులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన సభికుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహళలకు ప్రాతినిధ్యం(Representation) కల్పించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ వర్గాలు కీలక వోటు బ్యాంకుగా బీజేపీ గుర్తిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి గుజరాత్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ 53 శాతం వోటు షేర్‌ని సాధించింది. శుక్రవారమే(Friday) సీఎం పదవికి రాజీనామా చేసిన భూపేంద్ర పటేల్ శనివారం బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. ప్రచారానికి దూరంగా ఉండే భూపేంద్ర కడవా పాటిదార్ ఉప బృందం నుంచి అత్యున్నత పదవి చేజిక్కించుకున్న తొలినేతగా డబుల్ రికార్డు సాధించారు. 2021 సెప్టెంబర్‌లో నాటి సీఎం విజయ్ రూపాని స్థానంలో వచ్చిన భూపేంద్ర రికార్డు విజయం సాధించడం విశేషం.
మంత్రుల వివరాలు(Details of Ministers):
కేబినెట్ హోదా మంత్రులు: కాను దేశాయ్, రిషికేష్ పటేల్, రాఘవ్‌జీ పటేల్, బల్వంతసింహ్ రాజ్‌పుట్, కున్వర్జీ బవాలియా, ములు బెరా, కుబేర్ దిండోర్, భానుబెన్ బబారియా
స్వతంత్ర హోదా మంత్రులు: హర్ష్ సంఘ్వి, జగదీష్ విశ్వకర్మ
సహాయ మంత్రులు: పురుషోత్తమ్ సోలంకి, బచ్చు కబాడ్, ముఖేష్ పటేల్, ప్రఫుల్ పన్సేరియా, కువెర్జీ హల్పటి, బిక్షు సింహ్ పర్మార్