end

అజయ్‌ దేవ్‌గణ్‌ డైరెక్షన్‌లో బిగ్‌బీ..!

అవును. మీరు చదివింది నిజమే. కొన్ని కాంబినేషన్లు ఇండస్ట్రీలో చాలా ఆసక్తిని రేకిత్తిస్తాయి. ప్రముఖ బాలీవుడ్‌ కాథానాయకుడు అజయ్‌ దేవ్‌గణ్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటించనున్నారు. ఈ మూవీలో అజయ్‌ దేవ్‌గణ్‌ కూడా నటిస్తారని సమాచారం. సో, ఈ మూవీ బిగ్ మల్టీస్టారర్‌గా రాబోతుందన్నమాట. ఈ విషయాన్ని ప్రముఖ సినీ క్రిటిక్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ మూవీకి ‘మేడే’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

బాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్‌ మూవీలు రావడం సాధారణమైనప్పటికీ.. కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ ఇండస్ట్రీలో నిలిచిపోతాయి. ఇప్పటికే బాలీవుడ్‌ బడా హీరోలు అమితాబ్‌, షారూఖ్‌, హృతిక్‌ కలిసి చేసిన మూవీ సూపర్‌ డూపర్ హిట్. షారూఖ్‌, సల్మాన్‌.. అమీర్‌, అభిషేక్‌.. జాన్‌ అబ్రహాం, అభిషేక్ కలిసి చేసిన మూవీస్‌ అందులో కొన్ని. ఇప్పుడు మళ్లీ షారూఖ్‌ చేస్తున్న ‘పఠాన్’ అనే సినిమాలో సల్లూభాయ్‌ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ వార్తే నిజమైతే అభిమానులకు ఇక పండగే.

Exit mobile version