- బీజేపీలోకి విష్ణువర్ధన్ రెడ్డి
- ఈనెల 28న పీజేఆర్ వర్ధంతి
- ఆ తర్వాతే బీజేపీలో చేరిక!
మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా మారింది తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) పరిస్థితి. పార్టీలో నుంచి నేతాలు చేజారకుండా కాపాడడంలో విఫలమవుతున్నది. త్వరలో మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి(Vishnu Vardhan Reddy) పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ప్రకటించిన జంబో కమిటీ(Jumbo Committee)లోనూ ఆయనకు చోటు దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కాగా, ఆయన కాషాయ గూటికి చేరుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతున్నది.
పార్టీ యాక్టివిటీస్ కి దూరంగా..
సోదరి విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ యాక్టివిటీస్ కి దూరంగా ఉంటూ వస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ఖైరతాబాద్(Khairatabad) నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్(Jubilee Hills) బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. కాగా, విజయా రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఆమెకు ఖైరతాబాద్ టికెట్ కన్ఫామ్ అని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి విష్ణువర్ధన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జంబో కమిటీలో కూడా చోటు కల్పించకపోవడంతో పార్టీ మారాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ నెల 28న పీజేఆర్ వర్ధంతి కార్యక్రమం ఉన్నది. ఆ తర్వాత సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
(VIP facilities:ఎమ్మెల్యేలకు VIP సౌకర్యాలు ఉండవు)
పొమ్మనలేక పొగబెడుతున్నారు
పార్టీలో కొందరు పొమ్మనలేక పొగ బెడుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నా రు. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ(Tv Interview) లో కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. జంబో బిర్యానీలు పెట్టే బదులు.. పార్టీకి నమ్మకంగా పనిచేసిన వారికి అవకాశాలు కల్పిస్తే బాగుండేదని పేర్కొన్నా రు. పార్టీ మారాలనుకున్న ప్రతి సారి తండ్రి మెడలో కండువా చూసి ఆగిపోతున్నట్లుగా చెప్పాడు. పొమ్మనలేక పొగపెడితే ఎవరు మాత్రం ఏం చేయగలరని ప్రశ్నించారు. నగరంలో ఉన్న నలుగురైదుగురు కీలక వ్యక్తులను పార్టీ కాపాడుకోలేకపోతున్నదన్నారు.