end
=
Thursday, November 21, 2024
బిజినెస్‌Gold rates:బంగారం ప్రియులకు భారీ షాక్
- Advertisment -

Gold rates:బంగారం ప్రియులకు భారీ షాక్

- Advertisment -
- Advertisment -

  • మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు

దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం రేట్లు భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,350 గాను 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100గా ఉంది. కోల్​కతాలో (Kolkata) ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,200 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​56,950గా ఉంది. ముంబై (Mumbai), బెంగళూరు,కేరళ (Kerala)లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 210పెరగడంతో రూ. 56,950కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 56,740గా ఉండగా అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 2,100 పెరిగి రూ. 5,69,500గా కొనసాగుతోంది.

చెన్నైలో (Chennai) 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 53,170గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,000గా ఉంది. ఇక పూణెలో (pune) 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 52,200గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 56,950గాను ఉంది. హైదరాబాద్​(Hyderabad)లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,200గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,950గా నమోదైంది. విజయవాడలో (Vijayawada)సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో (vishakapatnam) కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్ (Ahmadabad)​లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,250గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 57,100గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,200గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,950గా ఉంది. ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​(Russia, ukrain) యుద్ధం, ఫెడ్​వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

దేశంలో వెండి ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 7,290గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.150 పెరిగి రూ. 72,900కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 72,750గా ఉండేది. ఇక హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 75,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ. 72,900.. బెంగళూరులో (Bangalore) రూ. 75,800గా ఉంది. దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 50 పెరిగి.. రూ 27,830కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 27,780గా ఉండేది. ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,830గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(Pawan Kalyan:24న కొండగట్టుకు జనసేనాని)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -