end

బిగ్‌బాస్ కంటెస్టెంట్ నిశ్చితార్థం..!

టాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్‌ పునర్నవి భూపాలం తన అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. తన తాజా ఇన్‌స్టా పోస్టు చూస్తుంటే పునర్నవి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటో షేర్‌ చేస్తూ.. చివరకు ఇదే జరుగుతుంది అనే క్యాప్షన్‌తో ఓ పోస్టు చేసింది. ఈ ఫొటోలో పునర్నవి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు. అంతేగాక తన ఉంగరం వేలుకు డైమండ్‌ రింగ్‌ను కూడా ధరించి ఉంది.

స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

దీంతో తన పోస్టు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. పునర్నవి నిశ్చితార్థం జరిగిందని నెటిజన్‌లు ఫిక్స్‌ అయిపోతున్నారు. తన కాబోయే భర్తను చూపించాలంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.నాగార్జున హోస్ట్‌గా చేసిన తెలుగు బిగ్‌బాస్‌-3 సీజన్‌లో పునర్నవి కంటెస్టెంట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. హౌజ్‌లో ఆమె సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌తో సన్నిహితంగా మెదులుతూ జానాల్లో ఆసక్తిని పెంచారు. చెప్పాలంటే వారి మధ్య చిన్నపాటి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా‌ నడిచింది.

ఇద్దరూ.. ఇద్దరే: ఉత్తమ్‌కుమార్‌

బయటకు వచ్చాక కూడా వీరిద్దరూ పలు టీవీ కార్యక్రమాల్లో జంటగా హాజరై, ప్రేక్షకులను అలరించారు. దీంతో పునర్నవి, రాహుల్‌లను లవ్‌ బర్డ్స్‌గా ప్రేక్షకులు ఫిక్స్‌ అయిపోయారు. ఈ క్రమంలో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న వీరిద్దరిని హోస్ట్‌.. వారి రిలేషన్‌ గురించి అడగ్గా.. తాము స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ వివరణతో ప్రేక్షకులు వారి స్నేహాన్ని అర్థం చేసుకుంటారనుకున్నారేమో.కాగా, బిగ్‌బాస్‌ హౌస్‌లో పునర్నవి ముక్కుసూటిగా వ్యవహరించడం చాలా మందికి నచ్చింది.

నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..?

తన యాటిట్యూడ్‌ని నాగార్జున కూడా మెచ్చుకోవడం కొసమెరుపు. ఉయ్యాల జంపాలా సినిమాతో సినిమాల్లోకి ఆరంగేట్రం చేసిన పునర్నవి.. ఆ సినిమాలో చక్కటి అభినయాన్ని కనబర్చింది. హీరోయిన్‌ ఫ్రెండ్‌గా, హీరో రాజ్‌తరుణ్‌ ప్రేయసిగా ఒదిగిపోయింది. ఈ సినిమాకు అభిమానులు, సినీ ప్రముఖల నుంచి మంచి ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పలు అవార్డులు కూడా గెలుచుకుంది.

ధరణి పోర్టల్ షురూ..

Exit mobile version