end
=
Monday, January 20, 2025
సినీమాBig Boss Season 6: బిగ్‏బాస్ సరికొత్త ఇంటిని చూశారా ?
- Advertisment -

Big Boss Season 6: బిగ్‏బాస్ సరికొత్త ఇంటిని చూశారా ?

- Advertisment -
- Advertisment -

Big Boss : తెలుగు టెలివిజన్ లో టాప్ రేటింగ్(Top Rating)తో దూసుకుపోయిన రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్. పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ల వరకు ప్రతీ ఒక్కరికీ ఈ రియాలిటీషో(reality show) సుపరిచతమే. ఎంటర్‌టైన్‌మెంట్‌కు సరికొత్త అడ్డగా బిగ్‌బాస్‌ సీజన్‌6. సీజన్‌, సీజన్‌కు ప్రేక్షకులకు ఆదరణ పెంచుకుంటూ పోతోంది. ఎక్కడో అమెరికాలో మొదలైన బిగ్‌బాస్‌(Big boss) రియాలిటీ షో ట్రెండ్‌ భారతదేశంలోని దాదాపు అన్ని భాషల్లో విస్తరించిందంటే ఈ షోకు ఉన్న క్రేజ్‌ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలుగులోనూ బిగ్‌బాస్‌ చాలా విజయవంతం అయింది. సీజన్‌6 ఎంత క్రేజ్ తెచ్చుకుంటుందో వేచి చూడాల్సిందే.

(బిగ్‏బాస్ 6 వచ్చేస్తుంది!!!)

బుల్లితెరపై నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్(Non-stop entertainment) సందడి షూరు కాబోతుంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‏బాస్ సీజన్ 6 ఇక ఈనెల 4 నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే 5 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఈ షో ఇప్పుడు 6వ సీజన్‏ను కొత్తగా గ్రాండ్‏గా ప్రేక్షకుల ముంది కి రానుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల(Contestants) ఎంపిక జరిగింది. వారింతా క్వారంటైన్(Quarantine)‏కు వెళ్లడం కూడా జరిగింది. ఈసారి మొత్తం 19 మంది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే వారికి సంబంధించిన లిస్ట్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది.ఈసారి ఫేమస్ సెలబ్రెటీలు, బుల్లితెర నటీనటులు, సింగర్స్‏తోపాటు ఓ సామాన్యుడు కూడా వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా 15 మంది కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపిచనున్నారు. తర్వాత మరో నలుగురిని వైల్డ్ కార్డ్ ప్రవేశం ద్వారా పంపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్‏బాస్ ప్రారంభ తేదీ సమయం అధికారికంగా ప్రకటించారు. తాజాగా బిగ్‏బాస్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసారు.

తాజాగా విడుదలైన ప్రోమో(Big Boss Promo)లో బిగ్‏బాస్ ఇంటి సెట్ ను చూపించారు. అంతేకాకుండా రాబోయే కంటెస్టెంట్స్, వారి ఫర్ఫామెన్స్‏లకు సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా చూపించారు. గత సీజన్ల కంటే భిన్నంగా బిగ్‏బాస్ ఇంటిని నిర్మించారు నిర్వాహకులు. ఈ ఆదివారం బిగ్‏బాస్ సీజన్ 6 మరింత గ్రాండ్‏గా మొదలుకానుంది. ఈసారి 24 గంటల ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రముఖ ఓటీటీ(OTT) ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hot Star) లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఈసారి చలాకీ చంటి(chalaki Chanti), రీతూ చౌదరీ, గలాట గీతూ, అర్జున్ కళ్యాణ్, నువ్వు నాకు నచ్చావ్ సుదీప, యూట్యూబర్ ఆదిరెడ్డి వంటి కొందరి పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు కూడా మరో జంట హౌస్ లోకి వెళ్లనున్నారని టాక్. అయితే ఆ జంట ఎవరోకాదు, మనకు బాగా తెలిసిన సింగర్ హేమ చంద్ర, శ్రావణ భార్గవి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలిసిపోయింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొననున్నారని టాక్.

(ఓటీటీకి కాస్త దూరంగా)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -