- కర్నూలు జిల్లా గార్గేయపురం వద్ద రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు సమీపంలోని గార్గేయపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. నందికొట్కూరు నియోజకవర్గం వీపనగండ్లకు చెందిన బాష, స్వామి, మరో వ్యక్తి ఈ ముగ్గురు స్నేహితులు కర్నూలు నుండి వీపనగండ్లకు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.