– ఖమ్మం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో కేసీఆర్
– దేశవ్యాప్తంగా ‘బంధు’లు అమలు చేయాలని డిమాండ్
ఖమ్మం జిల్లా(Khammam District) కేంద్రంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ(Public meeting) నిర్వహించింది. ఈ సందర్భంగా దేశంలో రాబోయేది విపక్షాల ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్ తెలిపారు. 2024 తర్వాత బీజేపీ పార్టీ ఇంటికి.. తాము ఢిల్లీ(Delhi)కి వెళ్లడం ఖాయమన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్(BRS) భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజాతో పాటు తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ లీడర్లు హాజరయ్యారు. అంతకు ముందు ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన కలెక్టరేట్‌తో పాటు కంటివెలుగు(Kanti Velugu) కార్యక్రమాన్నీ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం సభకు హాజరై మాట్లాడారు. దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ ఎన్నో ఏండ్ల పాలించాయని అయినా ఇండియా ముందుకు పోవడం లేదన్నారు. పొరుగు దేశమైన చైనా అన్నింటిలో ముందున్నదని, జపాన్, సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. అసమర్థ, మూర్ఖపు పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడానికే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని తెలిపారు. దేశాన్ని బీజేపీ(BJP) ప్రభుత్వం.. వెనుకబాటుకు గురిచేస్తున్నదని 2024 తర్వాత మోదీ ఇంటికి.. తాము ఢిల్లీకి అని చెప్పుకొచ్చారు.
దేశంలో అపారమైన సహజవనరులు ఉన్నాయని.. ఎవరినీ అడుక్కునే అవసరం లేదని అన్నారు. అమెరికా(America), చైనా మనకంటే పెద్ద దేశాలైనా వాటిలో వ్యవసాయభూమి తక్కువగా ఉందని, దేశంలో 50 శాతం సాగుకు అవసరమైన భూమి ఉందని తెలిపారు. కష్టపడి పనిచేసే జాతిరత్నాల్లాంటి ప్రజలున్నా ఇంకా మెక్ డోనాల్డ్ పిజ్జాలు(Pizza), బర్గర్లు తింటున్నామన్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఇండియా(INDIA) ఇంకా కెనడా(CANADA) నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటున్నదని వాపోయారు. దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా.. అసమర్థ పాలకుల వల్ల కేవలం 20వేల టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకుంటున్నామని విమర్శించారు. నీటి విషయంలో రాష్ట్రాల తగువు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. దేశంలో కరెంట్ 4లక్షల10వేల మెగావాట్లు ఉందని.. కానీ ఎప్పడూ 2లక్షల 10వేల మెగావాట్ల కంటే ఎక్కువగా వాడలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వెలుగు జిలుగుల భారతదేశాన్ని తయారు చేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వమంటే అవమాన పరుస్తున్నారని, బీఆర్ఎస్ ప్రతిపాదిత ప్రభుత్వం వస్తే దేశం మొత్తానికి తెలంగాణ(Telangana) మాదిరిగా ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. వేలమంది రైతులు ఆత్మహత్య(Suicide) చేసుకున్నా కేంద్రం పట్టించుకున్న పాపానపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు దేశం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసీని అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానిని తిరిగి తాము వాపస్ తీసుకొస్తామన్నారు.
దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తాం
దళితబంధు పథకం(Dalit Bandhu Scheme) తెలంగాణలో పుట్టిందని, దేశవ్యాప్తంగా ఏడాదికి 25 లక్షల కుటుంబాలకు దీనిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం చేయకుంటే.. తాము అధికారంలోకి వచ్చాక చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. మహిళల పాత్రను పెంచుతూ చట్టసభల్లో 35శాతం రిజర్వేషన్(Reservation) అమలు చేయాలని బీఆర్ఎస్ ప్రతిపాదన చేస్తుందని తెలిపారు. విపక్షాల ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే 5 ఏండ్లలోపు మిషన్ భగీరథలాంటి పథకం ద్వారా దేశంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని తెలిపారు.
అగ్నిపథ్ రద్దు చేస్తాం..
దేశంలో మతపిచ్చి లేపుతున్నారని, యువతను మతం పేరుతో పెడదోవ పట్టిస్తున్నారని కేసీఆర్(KCR) ఫైర్ అయ్యారు. మేకిన్ ఇండియా జోకిన్ ఇండియా అయిపోయిందన్నారు. చివరికి సైన్యంలోనూ వేలు పెడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ను రద్దు చేసి పాతపద్ధతినే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అందరం ఏకమైతే మూర్ఖుల, అసమర్థపాలనను అంతమొందిచడం సాధ్యమవుతుందన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ మొత్తం పాలసీలను ప్రజల ముందు పెడతామని, సీపీఎం, సీపీఐ(CPI) లాంటి పార్టీలతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందన్నారు. ఈ బహిరంగ సభలో రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస గౌడ్, శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, మాలోతు కవిత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, తాతా మధుసూదన్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, లావుడ్యా రాములు నాయక్, వనమా వెంకటేశ్వర రావు, హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.
కేరళ సీఎం పినరయి విజయన్
పోరాటాల గడ్డ తెలంగాణలో సుపరిపాలన కొనసాగుతున్నదని కేరళ సీఎం పినరయి విజయన్ కొనియాడారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో భావసారూప్యత కలిగిన పార్టీలు ఒక్కటయ్యే అవకాశం వచ్చిందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. సమీకృత కలెక్టరేట్ల(Collectorates) నిర్మాణం అద్భుతమన్నారు. కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న పథకాలను ప్రశంసించారు. కంటి వెలుగు స్కీం చరిత్రలో నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొన్నదని దేశ సమగ్రత, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని, ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా మోడీ పాలన సాగుతున్నదని విమర్శించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..
దేశమంతా కలిసి 2024 ఎన్నికల్లో బీజేపీని తరిమికొట్టాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Kejriwal) ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా నేర్చుకున్నామన్నారు. కేసీఆర్‌ను పెద్దన్నగా సంబోధించారు. కంటి వెలుగు, సమీకృత కలెక్టరేట్ల ఆలోచన అద్భుతమని ప్రశంసించారు. ఈ కార్యక్రమాలను ఢిల్లీలోనూ అమలు చేస్తామన్నారు. ‘మేం ఒకరి నుంచి మరొకరం నేర్చుకుంటాం. ఢిల్లీ మొహల్లా క్లినిక్ మంచి ఫలితాన్నిస్తున్నది. వాటిని చూసే సీఎం కేసీఆర్ ఇక్కడ బస్తీ దవాఖానలు(Hospital) ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు కూడా ప్రభుత్వ స్కూళ్ల(Government schools)లో చేరుతున్నారు.’ అని చెప్పుకొచ్చారు. బీజేపీ నియమించిన గవర్నర్లంతా రాజకీయం చేస్తున్నారని, మన దేశంలో ప్రజాస్వామ్యం(Democracy) ప్రమాదకర స్థితిలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్
సభకు వచ్చిన జనం చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తున్నదని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్(Punjab CM Bhagwant Singh Mann) అన్నారు. ఈ దేశం రంగు రంగుల పూల సమాహారం అని, కానీ ఒకే పువ్వు ఉండాలని కొందరు చూస్తున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, కానీ అవన్నీ జుమ్లాలుగా మిగిలిపోయాయని ఫైర్ అయ్యారు. బీజేపీ లోకతంత్రం కాకుండా, లూటీ తంత్రాన్ని నడిపిస్తున్నదని ఆరోపించారు. పంజాబ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర పథకాలను ప్రవేశపెడతామన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన సీఎం కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
యూపీ మాజీ సీఎం అఖిలేశ్
ఈ సభ చరిత్ర(history)లో నిలిచిపోతుందని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఇంత గొప్ప సభకు తనను ఆహ్వానించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఇక్కడి కలెక్టరేట్లు తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమన్నారు. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలన్నారు. మోడీ(MODI)కి ఇంకా 400 రోజులే మిగిలి ఉన్నాయని తెలిపారు. రైతులను ఆదుకుంటామని మోడీ మాటతప్పారని, నిరుద్యోగులనూ మోసం చేశారని విమర్శించారు.. దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కేసుల పేరుతో ఇరుకున పెట్టేలా చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో సుపరిపాలన అందుతున్నదని, సీఎం కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, నిరంతర కరెంటు(Continuous current), శుభ్రమైన తాగునీరు అందుతున్న ఏకైక రాష్ట్రం అని కొనియాడారు. భారతదేశం అతిపెద్ద సంక్షోభంలో ఉందని.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. మోడీ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ప్రధాని.. పేదలు, రైతుల పక్షాన లేరని.. అదానీ, అంబానీ, టాటా, బిర్లా జపం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీపై ఐక్య పోరాటానికి ఖమ్మం సభ నాంది కావాలని కోరారు. . ఇందులో భాగంగా మాట్లాడిన కేసీఆర్ ‘భారతదేశం మొత్తానికి తెలంగాణ మాదిరిగా ఉచిత కరెంటు సప్లయ్(Supply) చేస్తాం. తెలంగాణలో ఉన్న రైతుబంధు లాంటి స్కీం.. భారతదేశ వ్యాప్తంగా అమలు చేయడమే బీఆర్ఎస్ నినాదం. ప్రధానికి మంచి నీళ్లు ఇచ్చే చేతకాదా.. వచ్చే ఐదేండ్లలో మా ప్రభుత్వాన్ని, విపక్షాల ప్రభుత్వాన్ని ఎన్నుకోండి.. మిషన్ భగీరథ(Mission Bhagiratha) లాగానే ప్రతి ఇంటికీ నల్లా పెట్టి మంచినీటి జలాలు దేశవ్యాప్తంగా అందించడమే బీఆర్ఎస్ పాలసీ.’ ‘మీ పార్టీ ప్రయివేటైజేషన్.. మా పార్టీ నేషనలైజేషన్.. ఎల్ఐసీని అమ్ముతా అంటున్నవ్.. అమ్మేయ్ ఫర్వాలేదు. 2024 తర్వాత మీరు ఇంటికి.. మేం ఢిల్లీకి.. గ్యారంటీగా ఎల్ఐసీని వాపస్ తీసుకుంటం.. పబ్లిక్ సెక్టార్ లోనే దానిని కొనసాగిస్తాం. విశాఖ ఉక్కును ఎట్టిపరిస్థితుల్లో పోనియ్యం.. మళ్లీ తీసుకొచ్చి పబ్లిక్ సెక్టర్(Public Sector)లో పెడతాం’ అన్నారు.
(Vande Bharat:సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య వందే భారత్ ట్రైన్)