end
=
Monday, January 20, 2025
వార్తలుజాతీయంరైతులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
- Advertisment -

రైతులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

- Advertisment -
- Advertisment -

జైపూర్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఈ నేపధ్యంలో రాజస్థాన్‌కు చెందిన బీజేపీ నేత రైతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగిన రైతులు అక్కడే చికెన్ తింటూ, దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. దొంగలు, ఉగ్రవాదుల్లా వారు ప్రవర్తిస్తున్నారని దురుసుగా మాట్లాడారు.

ఈ వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే దిలావర్ అంతటితో ఆగకుండా.. రైతులు దేశం గురించి ఆందోళన చెందడం లేదని, మంచి మంచి వంటకాలు తింటూ పిక్నిక్ ఎంజాయ్‌ చేస్తున్నారని ఆరోపించారు. ధర్నాలో పాల్గొంటున్న కొంతమంది రైతులు చికెన్ బిర్యానీతో పాటు కాజూ, బాదామ్‌లను తింటూ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విధంగా రైతులు దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాపింపజేస్తున్నారని ఆయన అన్నారు. రైతులకు రైతులే శత్రువులుగా మారుతున్నారని, ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి వారిని ఈ ఆందోళనా స్థలం నుంచి ఖాళీ చేయించాలన్నారు. లేకపోతే బర్డ్ ప్లూ పెద్ద సమస్యగా పరిణమిస్తుందన్నారు. జైపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే దిలావర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడివి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -