- బోధన్ పట్టణ పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ దాడులు
- రియల్ ఎస్టేట్ వ్యాపారిని లంచం డిమాండ్ చేసిన పోలీసులు
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి మరో వ్యక్తికి మధ్య భూ వివాదంలో పోలీసులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులుకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే బోధన్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సాజిద్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి, మరో వ్యక్తి జగదీశ్వర్‌గౌడ్ మధ్య భూవివాదం జరగుతోంది. అయితే ఒకరిపై మరొకరు పోలీసు స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారు. అయితే ఈ క్రమంలో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి సాజిద్ బైక్‌ను స్టేషన్‌కు తరలించారు. తన బైక్ వెనక్కి ఇవ్వాలన్నా, కేసు వాపసు తీసుకోవాలన్న తనకు లక్ష రూపాయల విలువల గల సెల్‌ఫోన్, అలాగే 50 వేల నగదు లంచం ఇవ్వాలంటూ సీఐ రాకేష్‌గౌడ్, కానిస్టేబుల్ గజేందర్ సాజిద్‌ను డిమాండ్ చేశారు.
దీంతో బాధితుడు సాజిద్ ఏసీబీ అధికారులను సంప్రదించి జరిగిన విషయాన్ని వివరించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా సీఐ రాకేష్‌గౌడ్‌ను, కానిస్టేబుల్ గజేందర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ రవి కుమార్ తెలిపారు. వీరి దగ్గర నుండి 50 వేల నగదు, లక్ష రూపాయల విలువైన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని, విచారణ కొనసాగుతుందని తెలిపారు. సిఐ రాకేష్‌ను, కానిస్టేబుల్ గజేందర్‌ను కస్టడీలోకి తీసుకొని కోర్టుకు సమర్పించనున్నట్లు వివరించారు.