Weight loss: కోడి గుడ్లు(Eggs)ను అందరికి అందుబాటులో ఉండే అతి ముఖ్యమైన బలవర్ధకమైన(Reinforced) ఆహారం గా చెప్పవచ్చు.అయితే కోడిగుడ్డును రోజువారీ ఆహారంలో తీసుకోవడం పట్ల రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కోడిగుడ్డు రోజు తినడం వల్ల బరువు అధికంగా పెరుగుతారు అనే సందేహాలు అందర్లోనూ ఉన్నాయి.కానీ అది కేవలం అపోహ మాత్రమే పూర్తిగా తప్పు అని పోషకాహార నిపుణులు(Nutritionists) అంటున్నారు.
ఉడికించిన కోడిగుడ్లు రెండు రోజువారీ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఒక క్రమ పద్ధతిలో ఉడికించిన కోడిగుడ్డు ను రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల రెండు వారాలకు 24 పౌండ్ల బరువును తగ్గించుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ లో ఇప్పుడున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య ఊబకాయం(Obesity). ఊబకాయం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం(diabetes) మరియు అనేక రకాల క్యాన్సర్(Cancer) వంటి వ్యాధుల వచ్చే అవకాశం ఉంటుంది.