end
=
Wednesday, November 13, 2024
వార్తలుజాతీయంBaba Ramdev :బాలీవుడ్ తారలు డ్రగ్స్ తీసుకుంటారు..
- Advertisment -

Baba Ramdev :బాలీవుడ్ తారలు డ్రగ్స్ తీసుకుంటారు..

- Advertisment -
- Advertisment -
  •  యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
  • ఇండస్ట్రీలో డ్రగ్స్ హవా నడుస్తుందంటూ విమర్శలు

పతంజలి అధినేత, యోగా గురువు బాబా రాందేవ్ (Baba Ramdev) మరోసారి వివాదస్పద (Controversial comments) వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ తారల్లో (bollywood ) చాలామంది డ్రగ్స్ (drugs)వాడుతుంటారని వెల్లడించిన ఆయన.. సల్మాన్ ఖాన్ (salman khan)తీసుకున్నట్లు ఆధారాలున్నాయన్నాడు. అయితే అమీర్ ఖాన్ (aamir khan)గురించి తనకు తెలియదన్న రాందేవ్..  షారుఖ్ ఖాన్ (shahrukh khan) తనయుడు డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డాడని, జైల్లో (jail)కూడా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు చేశాడు.

రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో (uttar pradesh)డ్రగ్ వ్యతిరేక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా (viral) అయ్యాయి. కాగా నటీమణుల విషయానికొస్తే వారి విషయం దేవుడికే (god) తెలియాలంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ చుట్టూ డ్రగ్స్ ప్రపంచం (drugs world) విస్తరించి ఉందని, రాజకీయ రంగంలోనూ మాదకద్రవ్యాలు ఉన్నాయని, ఎన్నికల (election) సందర్భంగా మద్యం (wine)పంచడం తెలిసిందేనని బాబా రాందేవ్ పేర్కొన్నారు. ఇక డ్రగ్ వ్యసనం బారి నుంచి భారత్ కు (india) విముక్తి కల్పించాలని అన్నారు. అందుకోసం ఒక ఉద్యమం (Movement)లా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు.

(Elnaz : నా కుటుంబాన్ని రక్షించండి.. కన్నీటి పర్యంతమైన ఎల్నాజ్)

యూపీ లోని మొరాదాబాద్ (moharabad) లో నిర్వహించిన ఆర్యవీర్, (aryaveer), వీరాంగన సదస్సులలో మాట్లాడుతూ..  ‘షారుఖ్ ఖాన్ తనయుడు పార్టీలో (party) డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు. జైలుకు వెళ్లాడు. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు. అమీర్ ఖాన్ గురించి నాకు తెలియదు. ఈ యాక్టర్ల (actres)గురించి దేవుడికే తెలియాలి’ అని అన్నారు. ఎంతమంది సినీ తారలు డ్రగ్స్ తీసుకుంటారో ఎవరికి తెలుసని చెప్పారు. హీరోయన్లు (actress)కూడా తీసుకోవడం మరింత దారుణమని ( terrible) అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా డ్రగ్స్ హవానే నడుస్తుందని, రాజకీయాల్లోనూ ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో లిక్కర్ (Liquor)పంపిణీ జరుగుతుందని విమర్శించారు. భారత్‌ను డ్రగ్ విముక్తి చేయడానికి ప్రతిజ్ఞ (pledge)చేయాలని పిలుపునివ్వడం విశేషం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -